Monday, December 23, 2024

జూన్ 1 నుంచి ఢిల్లీ వాసులకు ఈవిల ఉచిత ఛార్జింగ్!

- Advertisement -
- Advertisement -

EV Charging

న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాన్ని కలిగి ఉన్న ఢిల్లీ వాసులు ఇప్పుడు ఓ శుభవార్త, జూన్ 1 నుండి వారు తమ విద్యుత్ వాహనాల(ఈవీ)ను మధ్యాహ్నం 12- 3 గంటల మధ్య దేశ రాజధాని అంతటా 40కి పైగా పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లలో ఉచితంగా ఛార్జ్ చేసుకోవచ్చు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడంతోపాటు పబ్లిక్ స్టేషన్లలో ఈవీల ఛార్జింగ్‌ను ప్రోత్సహించడం కోసం ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈవీ వినియోగదారులకు ఉచిత మధ్యాహ్నం ఛార్జీని అందించే ఈ కార్యక్రమాన్ని ఈవీ ఛార్జింగ్ స్టార్టప్ ఎలెక్ట్రీవా (ElectriVa) చేపడుతోంది, ఇది మూడు పౌర సంస్థల భాగస్వామ్యంతో 40కి పైగా పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News