Friday, July 5, 2024

లిక్కర్ కేసులో కవితకు మరో ఎదురు దెబ్బ

- Advertisement -
- Advertisement -

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు బుధవారం పరిగణలోకి తీసుకుంది. ఛార్జ్షీట్లో పేర్కొన్న నిందితులందరూ జూన్ 3న కోర్టుకు రావాలని సమన్లు జారీ చేసింది. ఆ రోజు ఎమ్మెల్సీ కవితను కూడా కోర్టు ముందు హాజరుపర్చనున్నా అధికారులు.

ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబందించి ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత వేసిన బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు నిన్న విచారించింది. ఈడీ, సీబీఐ తరుపున న్యాయవాదులతోపాటు కవిత తరుపు న్యాయవాది వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. కాగా, జ్యుడీషియల్ రిమాండ్ ఖైదీగా కవిత ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. జూన్ 2న ఆమె రిమాండ్ గడువు ముగియనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News