నిజానికి రేవంత్ రెడ్డి ఒక జాతీయ రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకుడు. కాంగ్రెస్ పార్టీ దక్షిణాదినే కాకుండా ఉత్తరాదిన, మధ్యభారతంలో కూడా తన పార్టీ ప్రయోజనాలను గురించి ఆలోచించవలసిన అవసరం ఉంటుంది. అయిన ప్పటికీ దక్షిణాది సమస్యను తీసుకొని ముందుకు పోవడానికి రేవంత్ ఉద్యుక్తులయ్యారంటే బహుశా కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం కూడా దీనికి అను కూలంగానే ఉండి ఉండవచ్చు. దక్షిణాదిలో ఎలా పాగా వేయాలా అని ఆలోచిస్తున్న భారతీయ జనతా పార్టీకి ఈ డీలిమిటేషన్ వ్యవహారం తల నొప్పిగా తయారు కాబోతున్నది అన్నది స్పష్టం.
ఒకవైపు జనాభాను పెంచుకుందామని మాట్లాడుతు న్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డీలిమిటేషన్ విషయం మాత్రం మాట్లాడటం లేదు. ఒకప్పుడు కేంద్రాన్ని, ఉత్తరాది పెత్తనాన్ని ఊగిపోతూ వ్యతిరేకించిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ అంశం మీద నోరు తెరవడానికి కూడా సిద్ధంగా లేరు. తమ మీద హిందీ రుద్దడాన్ని సహిం చబోమంటూ తమిళనాడులో ఉద్యమం చేయడానికి అక్కడి అధికారపక్షంతో సహా పలు వర్గాలు సిద్ధమవు తున్న తరుణంలో దాన్ని వ్యతిరేకిస్తూ బహిరంగసభల్లో మాట్లాడిన పవన్ కళ్యాణ్ డీలిమిటేషన్ వల్ల దక్షిణాదికి జరగబోతున్న నష్టాన్ని గురించి మాత్రం పల్లెత్తు మాట అనడం లేదు.
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ప్రతిపక్షంగా ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఒక మంచి అవకాశాన్ని జారవిడుచుకున్నారేమో అనిపిస్తోంది. డీలిమిటేషన్ ను జనాభా ప్రాతిపదికన చేయవద్దని ప్రధానమంత్రిని కోరుతూ ఒక లేఖ రాసి ఊరుకు న్నారాయన. ఆయన ఈ అవకాశాన్ని ఉపయోగిం చుకుని ఉంటే రాజకీయంగా బాగుండేది. అలా కా కుండా కేవలం ప్రధానమంత్రికి లేఖ రాసి ఊరుకోవ డంవల్ల ఆయన భారతీయ జనతా పార్టీకి అనుకూలం గా ఉన్నాడనే వాదనకు బలం చేకూర్చినట్టయింది.
జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ జరపకూడదని, అలా జరిగితే దక్షిణాదికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదిస్తున్న తరుణంలో, మిగతా దక్షిణాది రాష్ట్రాలు ఇదే బాటలో నడవడానికి సంసిద్ధమవుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజకీయ పక్షాలు మాత్రం ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడ్డట్టు కనిపిస్తున్నది. గత వారం చెన్నైలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ నాయకత్వంలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల రాజకీయ పక్షాల సమావేశానికి కర్ణాటక నుంచి అక్కడి ఉపముఖ్యమంత్రి డికె శివకుమార్, కేరళ నుంచి ముఖ్యమంత్రి పినరయి విజయన్, తెలంగాణనుంచి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ప్రతిపక్షంనుంచి కెటి రామారావు తదితరులు హాజరై డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా బలమైన గొంతుక వినిపించిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తదుపరి సమావేశం హైదరాబాదులో జరుగుతుందని ప్రకటించి శాసనసభలో ఏకగ్రీవ తీర్మానాన్ని కూడా చేయించి కేంద్రం మీద డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించారు.
నిజానికి రేవంత్ రెడ్డి ఒక జాతీయ రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకుడు. కాంగ్రెస్ పార్టీ దక్షిణాదినే కాకుండా ఉత్తరాదిన, మధ్య భారతంలో కూడా తన పార్టీ ప్రయోజనాలను గురించి ఆలోచించవలసిన అవసరం ఉంటుంది. అయినప్పటికీ దక్షిణాది సమస్యను తీసుకొని ముందుకు పోవడానికి రేవంత్ ఉద్యుక్తులయ్యారంటే బహుశా కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం కూడా దీనికి అనుకూలంగానే ఉండి ఉండవచ్చు. దక్షిణాదిలో ఎలా పాగా వేయాలా అని ఆలోచిస్తున్న భారతీయ జనతా పార్టీకి ఈ డీలిమిటేషన్ వ్యవహారం తలనొప్పిగా తయారు కాబోతున్నది అన్నది స్పష్టం.
1976 లోనే శ్రీమతి ఇందిరాగాంధీ ఈ డీలిమిటేషన్‌ను 25 సంవత్సరాలపాటు నిలిపివేస్తూ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. ఆ లెక్కన 2001లో జరగాల్సిన డీలిమిటేషన్‌ను మళ్లీ ఎన్‌డిఎ ప్రభుత్వం అటల్ బిహారి వాజ్‌పేయి నాయకత్వంలో మరో 25 సంవత్సరాలపాటు వాయిదావేసింది. లెక్క ప్రకారం ఇక డీలిమిటేషన్ 2026లో జరగవలసి ఉంటుంది. ఈలోగా మరో 25 సంవత్సరాలపాటు డీలిమిటేషన్ వాయిదా వేయాలని కోరుతూ దక్షిణాది రాష్ట్రాలు తీర్మానాలు చేస్తున్నాయి. దీనికి కారణం ఉంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలుపరిచిన కారణంగా దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గిపోవడం వల్ల ఈ సమస్య ఎదురవుతున్నదనేది స్పష్టం.
జనాభా లెక్కన గనుక ఇప్పుడు డీలిమిటేషన్ జరిగినట్టయితే దక్షిణాది రాష్ట్రాల్లో పార్లమెంటు స్థానాలు తగ్గడం ఖాయం. అందుకే దక్షిణాది రాష్ట్రాల రాజకీయ పక్షాలు డీలిమిటేషన్‌ను జనాభా ప్రాతిపదికన కాకుండా అభివృద్ధి సూచికల ఆధారంగా జరపాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మొదలుకొని భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఇతర నాయకులు అనేకమంది మాట్లాడుతున్న మాటలు చాలా అస్పష్టంగా ఉన్నాయి. అవి మరిన్ని అనుమానాలకు దారితీసి దక్షిణాది నెత్తిమీద డీలిమిటేషన్ కత్తి వేలాడుతున్నదనే సందేహానికి మరింత బలం చేకూరుస్తున్నాయి.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవల తమిళనాడులోని కోయంబత్తూరు, తిరువణ్ణామలై, రామనాథపురం ప్రాంతాల్లో బిజెపి పార్టీ కార్యాలయాల ప్రారంభోత్సవానికి హాజరైన సందర్భంగా దక్షిణాది రాష్ట్రాలు డీలిమిటేషన్ వల్ల ఒక్క స్థానం కూడా కోల్పోబోవడం లేదని చెప్పారు తప్ప జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ జరపబోమనే హామీని మాత్రం ఇవ్వలేదు. మిగతా బిజెపి నాయకులు కూడా ఇదే పద్ధతిలో మాట్లాడుతున్నారు. తెలంగాణకు సంబంధించిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ గాని, ఇతరులు గాని ఇదే మాట చెబుతున్నారు. ఒక్క సీటు కూడా తగ్గబోదు అంటారే తప్ప జనాభా ప్రాతిపదికన జరపబోమనే మాట మాత్రం చెప్పడం లేదు.
ఒకవైపు జనాభాను పెంచుకుందామని మాట్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డీలిమిటేషన్ విషయం మాత్రం మాట్లాడటం లేదు. ఒకప్పుడు కేంద్రాన్ని, ఉత్తరాది పెత్తనాన్ని ఊగిపోతూ వ్యతిరేకించిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ అంశం మీద నోరు తెరవడానికి కూడా సిద్ధంగా లేరు. తమ మీద హిందీ రుద్దడాన్ని సహించబోమంటూ తమిళనాడులో ఉద్యమం చేయడానికి అక్కడి అధికారపక్షంతో సహా పలు వర్గాలు సిద్ధమవుతున్న తరుణంలో దాన్ని వ్యతిరేకిస్తూ బహిరంగ సభల్లో మాట్లాడిన పవన్ కళ్యాణ్ డీలిమిటేషన్ వల్ల దక్షిణాదికి జరగబోతున్న నష్టాన్ని గురించి మాత్రం పల్లెత్తు మాట అనడం లేదు. భారతీయ జనతా పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని నడుపుతున్న కారణంగా తెలుగుదేశం, జనసేన పార్టీలు రెండూ ఆంధ్రప్రదేశ్‌కు నష్టం చెయ్యడానికి సిద్ధమవుతున్నట్టు అర్థమవుతున్నది.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ప్రతిపక్షంగా ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఒక మంచి అవకాశాన్ని జారవిడుచుకున్నారేమో అనిపిస్తుంది. డీలిమిటేషన్‌ను జనాభా ప్రాతిపదికన చేయవద్దని ప్రధానమంత్రిని కోరుతూ ఒక లేఖ రాసి ఊరుకున్నారాయన. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత సర్వస్వతంత్రులు. అటు తెలుగుదేశం, జనసేన పార్టీలకు ఉన్నమిత్రకూటమి సమస్య లేదు. ఇటు రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న జాతీయ పార్టీ కాంగ్రెస్‌కున్న ఉత్తరాది సమస్యలేదు. జగన్ మోహన్ రెడ్డి, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మంచి మిత్రులు. 2019లో జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పుడు ప్రమాణ స్వీకారోత్సవానికి స్టాలిన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మొన్న చెన్నైలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల రాజకీయ నాయకుల సమావేశానికి కూడా జగన్ మోహన్ రెడ్డిని కలిసి డిఎంకె పార్టీ నాయకులు స్వయంగా ఆహ్వానించారు కూడా. ఆయన ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఉంటే రాజకీయంగా బాగుండేది. అలా కాకుండా కేవలం ప్రధానమంత్రికి లేఖ రాసి ఊరుకోవడంవల్ల ఆయన భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్నారనే వాదనకు బలం చేకూర్చినట్టయింది. ఒక విషయం అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ పాల్గొంటున్న ఏ కూటమిలోనూ ఎటువంటి కార్యక్రమంలో కూడా పాల్గొనడానికి జగన్మోహన్ రెడ్డి ఇష్టపడకపోవచ్చు. ఎందుకంటే పార్టీ ప్రారంభించిన తొలినాటినుంచి కూడా ఆయన కాంగ్రెస్ పట్ల చాలా స్పష్టంగా వ్యతిరేకత ప్రకటిస్తూ వచ్చారు. కాంగ్రెస్ ఆయనకు చేసిన నష్టం అటువంటిది మరి. కానీ అలా అని దక్షిణాది రాష్ట్రాలన్నీ ఒక్కటే ఒక బలమైన నాయకత్వాన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో తానొక ముఖ్యపాత్ర నిర్వహించే అవకాశాన్ని ఆయన కోల్పోయారు.
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పక్షానికి, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న భారత రాష్ట్ర సమితికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. కానీ ఆ రెండు పక్షాలు డీలిమిటేషన్ అంశం మీద ఒకే రకమైన వాదన వినిపిస్తున్నాయి. చెన్నైలో స్టాలిన్ ఏర్పాటు చేసిన సమావేశానికి అధికార పక్షం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందంతోపాటు ప్రతిపక్ష ప్రతినిధి బృందానికి మాజీ మంత్రి కెటి రామారావు నాయకత్వం వహించిన విషయం తెలిసిందే. దక్షిణాదికి జరగబోతున్న ఈ అన్యాయాన్ని ఎదిరించడానికి అన్ని రాజకీయపక్షాలు కలిసి ఉంటే కేంద్ర ప్రభుత్వంలోని భారతీయ జనతా పార్టీ వెనక్కు తగ్గే అవకాశాలు ఉండేవేమో. ఇప్పటికైనా దక్షిణాదిన అధికారంలోకి రావాలని ఆశిస్తున్న భారతీయ జనతా పార్టీ డీలిమిటేషన్ విషయంలో పట్టుదలకుపోతుందా అనేది సందేహాస్పదమే.
ప్రస్తుతం లోక్‌సభలో 24 శాతం స్థానాలు ఉన్న దక్షిణాది ఇప్పుడు జనాభా ప్రాతిపదికన గనుక డీలిమిటేషన్ జరిగినట్టయితే 19 శాతానికి పడిపోయే ప్రమాదం ఉన్నది. 24 శాతం స్థానాలు ఉన్నప్పుడే కేంద్రంనుంచి రాష్ట్రాలకు అందుతున్న నిధుల పరిస్థితి ఏమిటో శాసనసభలో రేవంత్ రెడ్డి వివరంగా చెప్పారు. తెలంగాణ రాష్ట్రం కేంద్రానికి పన్నుల రూపంలో ఒక రూపాయి చెల్లిస్తే అక్కడినుంచి తిరిగి 45 పైసలు మాత్రమే తెలంగాణకు వస్తున్నాయి. అదే బీహార్ రాష్ట్రం కేంద్రానికి ఒక రూపాయి చెల్లిస్తే ఆ రాష్ట్రానికి ఆరు రూపాయలు తిరిగి పంపిస్తున్నది కేంద్రం. అదేమంటే జనాభా ఎక్కువ ఉన్న రాష్ట్రాలకు ఎక్కువ ఆర్థిక సాయం అందాల్సిన అవసరం ఉందని కేంద్రం వాదన. పన్నుల రూపంలో మనం చెల్లిస్తున్న డబ్బు మనకు తిరిగి ఇచ్చే విషయంలో జరుగుతున్న ఈ అన్యాయాన్ని ఎదిరించాల్సిన అవసరం ఉందని చెప్పి రాష్ట్రాలు భావిస్తున్నాయి. మరో 25 ఏళ్లపాటు డీలిమిటేషన్ వాయిదా వేసినట్లయితే అప్పటికి జనాభా విషయంలో సమతుల్యత ఏర్పడే అవకాశం ఉంటుందని దక్షిణాది రాష్ట్రాల రాజకీయపక్షాల వాదన.
దక్షిణాది రాష్ట్రాల రాజకీయపక్షాల వాదనను అంగీకరించి కేంద్రం డీలిమిటేషన్ వాయిదా వేస్తుందా లేక మొండిగా ముందుకు సాగుతుందా అనేది వేచి చూడాల్సిన విషయం. ఇక్కడో విషయం చెప్పుకోవాలి. ప్రస్తుతం ఉన్న పార్లమెంటు సభ్యుల సంఖ్య కంటే ఎక్కువమందికి అనుకూలంగా ఉండే విధంగా నూతన పార్లమెంట్ భవనాన్ని నిర్మించిన కేంద్రం ఇంకో 25 ఏళ్లపాటు ఈ ప్రక్రియను వాయిదా వేస్తుందా అనేది చర్చనీయాంశం. ప్రస్తుత నూతన పార్లమెంటు భవనంలో 888 మంది లోక్‌సభ సభ్యులు, 384 మంది రాజ్యసభ సభ్యులు కూర్చోవడానికి వీలైన వసతులు ఉన్నాయి. దీన్నిబట్టి చూస్తే బిజెపి డీలిమిటేషన్‌కు వెళ్లి పార్లమెంట్ స్థానాల సంఖ్యను పెంచుకునే ఆలోచనతోనే ఉందేమో అనే అనుమానం కలగక మానదు. ఏమైనా ఈ సంవత్సరం సెప్టెంబర్ నాటికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 75 సంవత్సరాల వయసు పూర్తి చేసుకుంటారు. మరి భారతీయ జనతా పార్టీ విధాన నిర్ణయం ప్రకారం 75 సంవత్సరాల తర్వాత ఎవరూ పదవుల్లో ఉండడానికి వీల్లేదనే సూత్రం గనక వర్తింపజేసినట్లయితే ప్రధాన మంత్రి మారితే డీలిమిటేషన్ విషయంలో భారతీయ జనతా పార్టీ మనసు మారుతుందా చూడాలి.