Sunday, November 17, 2024

యూనివర్సిటీ హైరింగ్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించిన డెలివరూ ఇండియా

- Advertisement -
- Advertisement -

గ్లోబల్ ఫుడ్ డెలివరీ కంపెనీ డెలివరూ, ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల నుండి విద్యార్థులను ఉద్యోగాలలో నియమించుకునే లక్ష్యంతో తమ తాజా నియామక కార్యక్రమాన్ని ప్రకటించింది. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు హైదరాబాద్‌లో ఉన్న వినూత్న ఫుడ్-టెక్ కంపెనీ ఇండియా డెవలప్‌మెంట్ సెంటర్ (IDC)లో పని చేసే అవకాశాన్ని కల్పిస్తారు.

దేశంలోని ప్రతిభపై ఆధారపడి, సాంకేతికతను కీలకంగా చేసుకున్న కచ్చితమైన టెక్ సంస్థగా నిలువాలని తమ లక్ష్యాన్ని సాకారం చేసే, ప్రపంచ స్థాయి టీమ్‌ను రూపొందించుకోవాలనే డెలివరూ యొక్క కొనసాగుతున్న నిబద్ధతలో భాగంగా ఈ హైరింగ్ కార్యక్రమం భాగంగా ఉంది. ఈ సంవత్సరం ప్రారంభంలో, IDC యొక్క మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని డెలివరూ యొక్క సీఈఓ హైదరాబాద్‌ను సందర్శించారు, ప్రపంచవ్యాప్తంగా డెలివరూలో దాని ప్రాముఖ్యతను నొక్కిచెప్పడం ద్వారా దానిని మరింత బలోపేతం చేసే ప్రణాళికలను ప్రకటించారు. IIIT హైదరాబాద్, NIT వరంగల్, చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, హైదరాబాద్ వంటి కొన్ని కళాశాలలను సందర్శించటం ద్వారా ఉద్యోగ నియామక ప్రక్రియ కొనసాగించాలని డెలివరూ ప్రణాళిక చేస్తోంది.

ఈ కార్యక్రమం గురించి డెలివరూ ఇండియా వైస్ ప్రెసిడెంట్ – ఇంజినీరింగ్, కంట్రీ హెడ్ శశి సోమవరపు మాట్లాడుతూ.. “ఈ ఏడాది చివరి నాటికి దేశంలో మొత్తం ఉద్యోగుల సంఖ్య పరంగా 200 మార్కును అధిగమించేందుకు మేము సరైన దిశలో ప్రయాణిస్తున్నాము. విభిన్నమైన, సమ్మిళిత శ్రామిక శక్తిని నిర్మించాలనే మా నిబద్ధతకు అనుగుణంగా, మేము ఈ తాజా రౌండ్ నియామకంలో ఎక్కువ సంఖ్యలో మహిళా ఉద్యోగులను నియమించాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. ఎంపికైన విద్యార్థులు, వచ్చే ఏడాది పూర్తి సమయపు ఉద్యోగులుగా తమ ప్రయాణాన్ని ప్రారంభించే ముందు, జనవరి నుండి ఆరు నెలల ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌కు హాజరవుతారు. అక్కడ వారు కోర్ ఇంజనీరింగ్ బృందాలతో కలిసి పని చేసే అవకాశాన్ని పొందుతారు” అని అన్నారు.

డెలివరూకు సంబంధించి యునైటెడ్ కింగ్‌డమ్ వెలుపల అతిపెద్ద సాంకేతిక కేంద్రంగా భారతదేశంలోని డెలివరూ యొక్క IDC నిలుస్తుంది. యునైటెడ్ కింగ్‌డమ్ లో కంపెనీ ప్రధాన కార్యాలయం ఉంది. స్వదేశంలో దాని ప్రాథమిక ఇంజనీరింగ్ కార్యకలాపాలకు తగిన మద్దతు ఇది ఇస్తుంది. 2023 చివరి నాటికి, ఇండియా ఐడీసీ కేంద్రం నుండి 200 మందికి పైగా ఇంజనీర్లు ఉంటారు. బ్యాకెండ్ ఇంజనీరింగ్, అనలిటిక్స్, ప్లాట్‌ఫారమ్‌లు, ఆటోమేషన్, మెషిన్ లెర్నింగ్ రంగంలో నిపుణులైన ఉద్యోగులను కలిగి ఉన్న డెలివెరూ యొక్క సెంట్రల్ టెక్నాలజీ సంస్థలో ఇది ప్రధాన భాగం కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News