Monday, December 23, 2024

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవ సమావేశం కోసం శ్యామ్ భట్‌తో డెలివరూ..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని, హైదరాబాద్‌లోని దాని అత్యాధునిక సాంకేతిక విభాగమైన ఇండియా డెవలప్‌మెంట్ సెంటర్ (IDC)లో ఆరోగ్యాన్ని, స్థిరత్వంను డెలివరూ రేకెత్తించింది. విఖ్యాత సైక్రియాట్రిస్టు(మనోరోగ వైద్యుడు) , డాక్టర్ శ్యామ్ భట్ నేతృత్వంలో, ఈ సాధికారత సమావేశం ఉద్యోగుల పూర్తి సామర్థ్యాన్ని వెలికి తీసే రీతిలో ఆహ్లాదకరమైన పని వాతావరణాన్ని పెంపొందించడంలో డెలివరూ యొక్క అచంచలమైన అంకితభావానికి అద్దం పడుతుంది.

ఈ సమావేశాన్ని డాక్టర్ భట్ ఆకట్టుకునే రీతిలో తన ప్రారంభ ప్రసంగంతో ప్రారంభించారు. తరువాత ఫైర్‌సైడ్ చాట్‌లో మాట్లాడుతూ.. ఒత్తిడిని నిర్వహించడం, పని-జీవిత సమతుల్యతను మెరుగుపరచడం, సానుకూల పని వాతావరణాన్ని పెంపొందించడంపై లోతైన పరిజ్ఞానం, నైపుణ్యాన్ని పంచుకున్నారు. ఈ సమావేశం ప్రాక్టికల్ మెడిటేషన్ రౌండ్‌తో ముగిసింది, దాని తర్వాత ఇంటరాక్టివ్ Q&A, జరిగింది హాజరైనవారు డాక్టర్ శ్యామ్ భట్‌ ను నేరుగా ప్రశ్నించటానికి అనుమతించింది.

ఈ కార్యక్రమంపై డెలివరూ ఇండియా వైస్ ప్రెసిడెంట్ – ఇంజినీరింగ్, కంట్రీ హెడ్ శశి సోమవరపు మాట్లాడుతూ.. “డెలివరూ వద్ద, మా ప్రాథమిక సూత్రాలు, మా ఉద్యోగుల శ్రేయస్సుకు అమిత ప్రాధాన్యతనిస్తుంటాయి. ఈ సెషన్‌ను నిర్వహించడం కోసం వచ్చిన డాక్టర్ శ్యామ్‌ భట్కి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అతని లోతైన నైపుణ్యం సంభాషణను ఫలవంతం చేసింది, నేటి వేగవంతమైన ప్రపంచంలోని డిమాండ్‌లను తీర్చడానికి అవసరమైన సాధనాలు, జ్ఞానంతో మా ఉద్యోగులను సమృద్ధి చేస్తుంది” అని అన్నారు.

సైకియాట్రీ, ఇంటర్నల్ మెడిసిన్, సైకోసోమాటిక్ మెడిసిన్‌లలో అమెరికన్ బోర్డ్ సర్టిఫికేషన్‌లను కలిగి ఉన్న డాక్టర్ శ్యామ్ భట్, ఈ స్పెషలైజేషన్‌లను కలిగిన భారతదేశంలోని ఒకే ఒక్క వైద్యునిగా ఖ్యాతి గడించారు, ఆయన పాశ్చాత్య వైద్య నైపుణ్యాన్ని తూర్పు సిద్దాంతాలతో సజావుగా మిళితం చేశారు. అయన నిర్వికల్ప: ది మైండ్-బాడీ సెంటర్ వ్యవస్థాపకులు. అతని వైద్యపరమైన నైపుణ్యంను మించి, పని-జీవిత సమతుల్యత, ఒత్తిడి నిర్వహణ, నాయకత్వ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై ఎక్కువ మంది ఇష్టపడే కన్సల్టెంట్ గా మరియు వక్తగా ఉన్నారు. అత్యధికంగా అమ్ముడైన “హౌ టు హీల్ యువర్ బ్రోకెన్ హార్ట్: ఎ సైకియాట్రిస్ట్స్ గైడ్ టు డీలింగ్ విత్ హార్ట్‌బ్రేక్” అనే పుస్తక రచయిత ఆయన.

“డెలివరూ వంటి సంస్థలు పని ప్రదేశంలో మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడం ప్రాముఖ్యతను ఎక్కువగా గుర్తించడాన్ని చూసి నేను సంతోషిస్తున్నాను. ఈ రోజు డెలివరూ కుటుంబంతో కనెక్ట్ కావడం ఆనందంగా ఉంది. ఈ చర్చల సానుకూల ప్రభావాన్ని వారి జీవితాలు, పనిలో చూడటానికి నేను ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. కలిసికట్టుగా, మనం శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వవచ్చు, నేటి వేగవంతమైన ప్రపంచంలో అభివృద్ధి చెందవచ్చు” అని డాక్టర్ శ్యామ్ భట్ తెలిపారు.

భారతదేశంలోని డెలివరూ IDC, యునైటెడ్ కింగ్‌డమ్ వెలుపల అతిపెద్ద సాంకేతిక కేంద్రంగా వెలుగొందుతుంది. ఇక్కడ కంపెనీ ప్రధాన కార్యాలయం ఉంది మరియు దాని స్వదేశంలో దాని ప్రాథమిక ఇంజనీరింగ్ కార్యకలాపాలకు మద్దతు ఇస్తుంది. ఎనలిటిక్స్, ప్లాట్‌ఫారమ్‌లు, ఆటోమేషన్, మెషిన్ లెర్నింగ్ రంగంలో నిపుణులైన ఉద్యోగులను కలిగి ఉన్న డెలివరూ యొక్క సెంట్రల్ టెక్నాలజీ సంస్థలో IDC ప్రధాన భాగంగా వుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News