Monday, January 20, 2025

కుక్కను చూసి మూడో అంతస్తు నుంచి దూకేసిన డెలివరీ బాయ్

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: కుక్క వెంటపడడంతో స్విగ్గీ డెలివరీ బాయ్ మూడో అంతస్తు నుంచి కిందకు దూకిన సంఘటన హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో జరిగింది. యూసుఫ్‌గూడ ప్రాంతానికి చెందిన మహ్మద్ రిజ్వాన్ అనే యువకుడు స్విగ్గీలో ఫుడ్ డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. ఫుడ్ డెలివరీ చేసేందుకు బంజారాహిల్స్‌లోని ఓ ఆపార్ట్‌మెంట్‌లోని మూడో ఫ్లోర్‌కు వెళ్లాడు. అతడి వెంట కుక్క పడడంతో కిందకు దూకాడు. తీవ్రంగా గాయపడిన అతడిని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News