Tuesday, January 7, 2025

డెలివరీ బాయ్‌గా మారిన జొమాటో సిఇవో

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : జొమాటో సీఈవో దీపీందర్ గోయల్ ఫ్రెండ్షిప్ డేను (friendship day) వినూత్నంగా సెలబ్రేట్ చేసుకున్నారు. స్పెషల్ డే సందర్భంగా గోయల్ కస్టమర్లు, ఎగ్జిక్యూటివ్లకు స్వయంగా తానే ఫుడ్ డెలివరీ చేశారు. డెలివరీ పార్ట్నర్లు, రెస్టారెంట్ పార్ట్నర్లు, కస్టమర్లకు ఫుడ్ డెలివరీ చేయడంతో పాటు ఫ్రెండ్షిప్ బ్యాండ్లను పంపిణీ చేసిన ఫొటోలను జొమాటో సీఈవో ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. కంపెనీతో అనుబంధం ఉన్న అసోసియేట్స్కు ఫుడ్ డెలివరీ చేసేందుకు గోయల్ రాయల్ ఎన్ఫీల్ బ్పై వెళుతున్న ఫొటో కూడా వీటిలో ఉంది.

డెలివరీ ఎగ్జిక్యూటివ్లు, కస్టమర్లు, రెస్టారెంట్ పార్ట్నర్లకు తాను అందించే ఫ్రెండ్షిప్ బ్యాండ్లు ఆయన చేతిలో కనిపించాయి. గోయల్ ఫ్రెండ్షిప్ డే జరుపుకున్న తీరుపై నెటిజన్లు ప్రశంసలు గుప్పించారు. మీరు చండీఘఢ్లో డెలివరీ చేస్తున్నారా..మీరు ఒకరోజు మా డెలివరీ పార్ట్నర్గా వస్తారని ఆశిస్తున్నా అంటూ ఓ యూజర్ కామెంట్ చేశారు. భారత్తో పాటు బంగ్లాదేశ్, దుబయ్, మలేషియా, అమెరికా వంటి పలు దేశాల్లో ప్రజలు ఆదివారం ఫ్రెండ్షిప్ డేను జరుపుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News