Sunday, December 22, 2024

మూడు కేజీల బంగారంతో డెలివరీ బాయ్స్ అదృశ్యం..

- Advertisement -
- Advertisement -

Delivery boys stolen 3 kg Gold in NTR District

మూడు కేజీల బంగారంతో డెలివరీ బాయ్స్ అదృశ్యం
ఎపిలోని ఎన్‌టిఆర్ జిల్లాలో ఘటన
మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్‌టిఆర్ జిల్లా కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో యజమానిని నమ్మించి 3 కేజీల బంగారం ఆభరణాలతో డెలివరీ బాయ్స్‌ ఉడాయించారు. జైమాతాది లాజిస్టిక్స్ యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.వివరాల్లోకి వెళితే..విజయవాడ కొత్తపేట కోమల విలాస్ సెంటరులోని ఎస్‌ఎస్ టవర్స్‌లో రాజస్థాన్‌కు చెందిన సునీల్ కుమార్ నివాసముంటున్నారు. ముంబైకి చెందిన జైమాతాది కార్గో ప్రైవేటు లిమిటెడ్ నుంచి ఫ్రాంచైజీ తీసుకొని ‘జైమాతాది లాజిస్టిక్స్‘ అనే పేరుతో 5 ఏళ్లుగా కొరియర్ సర్వీసు నిర్వహిస్తున్నారు. ముంబై నుంచి కొరియర్ ద్వారా వచ్చిన బంగారు ఆభరణాలు, డైమండ్స్‌ను రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు డెలివరీ చేయడంతో సునీల్ కుమార్ కమిషన్ వస్తుంది. ఈ డెలివరీ కోసం సునీల్ కుమార్ పలువురు బాయ్స్ ను పనిలో పెట్టుకున్నారు. అతని వద్ద పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులు బంగారం డెలివరీ చేసేందుకు వెళ్లి అటునుంచే ఉడాయించారు.

ఈనెల 7న ముంబై నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన కార్గో విమానం నుంచి ఆభరణాల తాలూకు బాక్సులను యజమాని తీసుకెళ్లాడు. అనంతరం ఆ ఆభరణాలను ప్రాంతాల వారీగా డెలివరీ చేసేందుకు విడి విడిగా ప్రత్యేక బాక్సుల్లో ప్యాకింగ్ చేయించారు. అందులో కొన్ని బాక్సులను డెలివరీ బాయ్స్ రాజీవ్ శర్మ, భవానీసింగ్ అప్పగించి డెలివరీ చేసేందుకు ఈ నెల 8వ తేదీన పంపారు. ఈక్రమంలో శుక్రవారం ఉదయం వాళ్లను రైలు ఎక్కించిన ఓనర్ సునీల్ కుమార్ మధ్యలో ఫోన్లు చేస్తూ వాకబు చేస్తూ ఉన్నాడు. కొంత సమయం తరువాత డెలివరీ బాయ్స్ ఫోన్లు స్విచ్ఛాఫ్ వచ్చాయి. ఆభరణాలు డెలివరీ తీసుకోవాల్సిన షాపుల వారికి ఫోన్లు చేస్తే రాలేదని సమాధానం వచ్చింది. దీంతో ఆ ఇద్దరు ఆభరణాలతో ఉడాయించినట్లుగా భావించిన యజమాని పోలీసులను ఆశ్రయించాడు. సుమారుగా రూ.1.5 కోట్లు విలువైన 3 కేజీల ఆభరణాలతో పారిపోయారని అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.

Delivery boys stolen 3 kg Gold in NTR District

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News