Sunday, December 22, 2024

పిసి సేల్స్ తగ్గడంతో డెల్‌లో 6,650 ఉద్యోగులపై వేటు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : పిసి అమ్మకాలు క్షీణించిన కారణంగా అమెరికాకు చెందిన టెక్నాలజీ కంపెనీ డెల్ తన ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 6,650 మంది ఉద్యోగుల లేఆఫ్ ఉంటుందని కంపెనీ వెల్లడించింది. మాంద్యం, అనిశ్చితి పరిస్థితుల కారణంగా ఖర్చులను తగ్గించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని కంపెనీ కొచీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జెఫ్ క్లార్కె తెలిపారు. ఉద్యోగాల కోత మొత్తం వర్క్‌ఫోర్స్‌లో 5 శాతం ఉంటుందని కంపెనీ అధికారి ఒకరు తెలిపారు.

కరోనా మహమ్మారి సమయంలో పిసి బూమ్‌తో డెల్, ఇతర హార్డ్‌వేర్ తయారీ సంస్థలకు డిమాండ్ పెరిగింది. ప్రాథమిక గణాంకాల ప్రకారం, 2022 నాలుగో త్రైమాసికంలో పర్సనల్ కంప్యూటర్ల ఎగుమతులు క్షీణించడం కనిపించిందని ఇండస్ట్రీ అనలిస్ట్ ఐడిసి పేర్కొంది. 2021 సంవత్సరంతో పోలిస్తే పెద్ద కంపెనీల్లో డెల్ అత్యధికంగా 37 శాతం క్షీణతను నమోదు చేసింది. పిసిల నుంచి డెల్ 55 శాతం ఆదాయం పొందింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News