- Advertisement -
అహ్మదాబాద్ : గుజరాత్ లోని అహ్మదాబాద్ నుంచి సేకరించిన కొవిడ్ నమూనాల్లో డెల్టా , కప్పా రకాలు కనిపించాయి. ఆగస్టులో అహ్మదాబాద్ నుంచి పుణె లేబొరేటరీకి పంపిన రెండు నమూనాల్లో డెల్టా, కప్పా రకాలు బయటపడగా, సెప్టెంబరులో పంపిన నమూనాలో డెల్టా వేరియంట్ బయటపడిందని బిజె మెడికల్ కాలేజీ మైక్రోబయోలజీ డాక్టర్ కానూ పటేల్ వెల్లడించారు. అక్టోబరులో పంపిన నమూనాల ఫలితాల కోసం నిరీక్షిస్తున్నట్టు చెప్పారు. నవంబరులో ఇంతవరకు ఎలాంటి కరోనా నమూనాలు పంపలేదని వివరించారు. దేశంలో డెల్టా వేరియంట్ గత అక్టోబర్‌లో బయటపడింది. కరోనా మహమ్మారి వ్యాప్తిలో ఇదే ప్రధానమైంది. సెకండ్ వేవ్ లోనూ ఏప్రిల్‌మే నెలల్లో డెల్టా వేరియంట్ తీవ్ర ప్రభావం చూపింది.
- Advertisement -