Tuesday, November 5, 2024

మహారాష్ట్రలో చెలరేగుతున్న డెల్టా

- Advertisement -
- Advertisement -

Delta derivative AY.4 soars in Maharashtra

ముంబై : మహారాష్ట్ర లోని డెల్టా లోని ఏవై 4 రకం కేసులు వేగంగా పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో ఏప్రిల్ లో పరీక్షించిన నమూనాల్లో ఒక శాతం కేసుల్లో ఎవై 4 రకాన్ని గుర్తించారు. జులైలో 2 శాతం, ఆగస్టులో అకస్మాత్తుగా 44 శాతం నమూనాల్లో ఈ రకం బయటపడినట్టు ఓ వార్తా సంస్థ వివరించింది. ఆగస్టులో 308 నమూనాలను విశ్లేషించగా , 11.1 (36 శాతం) డెల్టా, 13.7 (44 శాతం) ఏవై 4 కేసులు వెలుగు చూశాయి. ఈ రకం కరోనా వైరస్ ప్రభావం , వ్యాధి తీవ్రత ఏ స్థాయిలో ఉందో గుర్తించేందుకు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ బిఎంసీ ప్రత్యేక బృందాన్ని నియమించింది. వేగంగా వ్యాప్తి చెందే లక్షణం, వ్యాధి తీవ్రత, బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్లకు కారణమని నిర్ధారణ అయిన వాటినే ఆందోళన కలిగించే రకంగా వర్గీకరిస్తామని ఆ నివేదికలో వైద్య నిపుణులు వెల్లడించారు. ఇప్పటికైతే దీన్ని ఆందోళన కలిగించే రకంగా వర్గీకరించలేదని చెప్పారు. మహారాష్ట్రలో ప్రస్తుతం 2 వేలకు పైగా కరోనా కేసులు, 28 మరణాలు చోటు చేసుకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News