Tuesday, April 1, 2025

మంచు రన్‌వేపై పల్టీలు కొట్టిన డెల్టా జెట్ విమానం

- Advertisement -
- Advertisement -

టొరంటో: టొరంటోలోని పియర్సన్ విమానాశ్రయంలో డెల్టా జెట్ విమానం సోమవారం ల్యాండ్ అవుతున్నప్పుడు తలక్రిందులుగా పల్టీలు కొట్టింది. విమానంలో ఉన్న 80 మంది ప్రాణాలతో బయటపడ్డారు. కొందరికి స్వల్ప గాయాలయ్యాయని విమానాశ్రయ చీఫ్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. మిన్నియాపాలిస్ నుండి 76 మంది ప్రయాణీకులు, నలుగురు సిబ్బందితో బయలుదేరిన విమానం మధ్యాహ్నం 2.15 గంటల ప్రాంతంలో ల్యాండ్ అవ్వడానికి ప్రయత్నించినప్పుడు, గంటకు 65 కిమీ. వేగంతో గాలులు వీచగా మంచు ఎగిరింది. టవర్, పైలట్ మధ్య కమ్యూనికేషన్లు సాధారణంగా ఉన్నాయి. అయితే విమానం ల్యాండ్ అయ్యేప్పుడు అంత తీవ్రంగా ఏమి జరిగిందో స్పష్టంగా తెలియలేదు.

పారామెడిక్ కాన్ఫరెన్స్ కోసం టొరంటోకు ప్రయాణిస్తున్న ప్రయాణీకుడు పీటర్ కార్లన్ మాట్లాడుతూ ‘ల్యాండింగ్ చాలా బలవంతంగా జరిగింది’ అన్నారు. కెనడియన్ అధికారులు ఈ ఘటనకు సంబంధించి రెండు సంక్షిప్త వార్తా సమావేశాలు నిర్వహించారు.కానీ ప్రమాదం గురించి ఎటువంటి వివరాలు అందించలేదు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో మిత్సబిషి సిఆర్‌జె900ఎల్‌ఆర్ బోల్తా పడిన పరిణామాలు, ప్యూజ్‌లేజ్ చెక్కుచెదకుండా కనిపించడం, అగ్నిమాపక సిబ్బంది మంటల్లో మిగిలి ఉన్న వాటిని ఆర్పుతున్న దృశ్యాలు, ప్రయాణీకులు దిగి టార్మాక్ మీదుగా నడుస్తున్న దృశ్యాలు ఉన్నాయి. ఎటువంటి ప్రాణనష్టం జరుగకపోవడం పట్ల తాము కృతజ్ఞులమని గ్రేటర్ టొరంటో విమానాశ్రయాల అథారిటీ సిఈవో డెబోరా ప్లింట్ విలేకరులతో అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News