Friday, December 20, 2024

సిద్దిపేట టూ షోలాపూర్‌కు డీలక్స్ బస్సు సర్వీస్ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: పెరుగుతున్న అవసరాలు, ప్రజా సౌకర్యార్ధం ప్రయాణీకులను తమ గమ్యస్ధానాలకు క్షేమంగా చేర వేయడంతో పాటు రద్దీకి అనుగుణంగా నూతన డీలక్స్ సర్వీస్ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. బుధవారరం సిద్దిపేట జిల్లా కేంద్రమైన సిద్దిపేట ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో సిద్దిపేట నుండి షోలాపూర్ వరకు మూడు నూతన డీలక్స్ సర్వీసు బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ షోలాపూర్‌కు వెళ్లే ప్రయాణీకులు అందరు అదునాతన బస్సు సౌకర్యాన్ని వినియోగించుకోవాలన్నారు. గత కొన్నేళ్లుగా డిపో ఆర్టీసీ బస్సులను ఆదరిస్తూ డిపో ఆదాయాన్ని దాని ద్వారా ఆర్టీసీ సంస్ధ ఆదాయం పెరగడానికి సహకరిస్తున్న ప్రయాణీకులకు దన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు.

సిద్దిపేట నుంచి 5 డీలక్స్ బస్సులు వచ్చే వారం పదిరోజుల్లో ప్రారంభిస్తామన్నారు. సిద్దిపేట నుండి ఐదు డీలక్స్ బస్సులు హైదరాబాద్, సికింద్రాబాద్ సిద్దిపేట మీదుగా నడపనున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో గొందియాకు కూడా డీలక్స్ బస్సు సౌకర్యం కల్పించేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. సిద్దిపేట నుండి సికింద్రాబాద్ , జహీరాబాద్ ,ఉమ్నాబాద్, ఉమర్గనల్ దుర్గ్ మీదుగా షోలాపూర్‌కు బస్సులు బయలు దేరతాయని అన్నారు. అదునాతన సౌకర్యాలతో కూడిన పుష్ బ్యాక్ సీట్లతో కూడిన మూడు నూతన డీలక్స్ సర్వీసర్ బస్సులు సిద్దిపేట నుండి ప్రతి రోజు ఉదయం 6.30 గంటలకు, సాయంత్రం 6.30 గంటలకు షోలాపూర్‌కు బయలు దేరుతాయని తెలిపారు. అదే విధంగా మద్నాహ్నం 12.30 గంటలకు జేబీఎస్‌కు డీలక్స్ బస్సు సౌకర్యం అందుబాటులో ఉన్నదని తెలిపారు.

షోలాపూర్‌కు వెళ్లే ప్రయాణీకులు అందరు ఈ అదునాతన బస్సు సౌకర్యం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. షోలాపూర్‌కు వెళ్లే బస్సులు tsrtconline.inఆన్‌లైన్ ద్వారా వైబ్ సైట్‌లో టిక్కెట్లు బుక్ చేసుకునే సౌకర్యం ఉన్నదని సిద్దిపేట ఆర్టీసీ డిపో వర్గాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజా శర్మ, ఆర్టీసీ ఆర్‌ఎం సుదర్శన్, సిద్దిపేట ఆర్టీసీ డిపో మేనేజర్ సుఖేందర్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ సభ్యుడు పాల సాయిరాం, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News