Thursday, November 14, 2024

అలెక్సీ విడుదలకు రష్యాలో వేల మంది ర్యాలీ

- Advertisement -
- Advertisement -

Demand for Alexei's release Thousands rally in Russia

 

మాస్కో : జైలులో ఉన్న ప్రతిపక్షనాయకుడు అలెక్సీ నవల్నీని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం రష్యా వీధుల్లో వేలాది మంది ర్యాలీ నిర్వహించారు. జాతీయ స్థాయిలో జరిగిన ఈ నిరసన ప్రదర్శనలు క్రెమ్లిన్‌ను చిందరవందర చేశాయి. ఈ సందర్భంగా వందలాది మందిని పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు. రష్యా 11టైమ్ జోన్స్ వెంబడి అనేక నగరాల్లో సాగిన ఆందోళనల్లో పాల్గొన్న ఆందోళనకారుల్లో 260 మందిని పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు. మాస్కోలో ఊహించన భద్రతా చర్యలు చేపట్టారు. క్రెమ్లిన్‌కు సమీపాన అనేక సబ్‌వే స్టేషన్‌లను మూసి వేశారు.

రెస్టారెంట్లు, స్టోర్లు మూసి వేయించారు. బస్సు రవాణా రద్దు చేశారు. అవినీతిపై నిఘాదారు, అధ్యక్షుడు పుతిన్‌ను తీవ్రంగా విమర్శించే 44 ఏళ్ల అలెక్సీ నవల్నీ జర్మనీ నుంచి రాగానే జనవరి 17 న అరెస్ట్ అయ్యారు. క్రెమ్లిన్‌పై తీవ్ర విమర్శలు చేసినందుకు ఆయనపై గతంలో విషప్రయోగం జరగగా జర్మనీలో చికిత్స పొంది ఐదు నెలలు గడిపారు. అయితే ఆయన ఆరోపణలను రష్యా అధికార వర్గాలు తిరస్కరించాయి. అలెక్సీ మద్దతుదారులు ఆదివారం మాస్కో లుబియాంకా స్కేర్ వద్ద ఆందోళనలకు పిలుపునిచ్చారు. అలెక్సీ సోదరుడు ఒలెగ్, ముఖ్య అనుచరుడు లియుబొవ్ సొబొయి మరో ముగ్గురు శుక్రవారం నాడు రెండు నెలల గృహనిర్బంధం లోకి వెళ్లారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News