Sunday, December 22, 2024

సేద్యానికి పవర్ ఫుల్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:రాష్ట్రం ఏర్పడిన త రువాత విద్యుత్ డిమాండ్ అంతకంతకు పెరుగుతోంది. డిమాండ్ తగ్గట్టుగానే విద్యుత్ సరఫరా, ఉ త్పత్తిలోనూ విద్యుత్ శాఖ ముందంజలో ఉంది. దీంతోపాటు ఎక్కడా రెప్పపాటు విద్యుత్‌కు అంతరాయం కలగకుండా ఆ శాఖ చర్యలు చేపట్టింది. జూలైలో 14,167 మెగావాట్ల అధిక విద్యుత్ వినియోగం రాష్ట్రంలో నమోదు కాగా, ప్రస్తుతం వ్యవసాయ రంగానికి సంబంధించి విద్యుత్ డిమాండ్ గురువారం నాడు 1668 మెగావాట్స్‌గా నమోదు కావడం విశేషం. గత సంవత్సరం నమోదైన మె గావాట్స్‌ను అధిగమించి చరిత్ర సృష్టించింది.

రా ష్ట్రంలో వ్యవసాయ సాగు విస్తీర్ణం పెరగడం,హైదరాబాద్‌తో పాటు జిల్లా కేంద్రాల్లో పరిశ్రమలు పెరగడం వల్ల జూలైలో కూడా విద్యుత్‌కు డిమాండ్ పెరగ్గా మార్చి, ఏప్రిల్ నెలలోనే 14 వేల మెగావా ట్ల పైచిలుకు విద్యుత్ డిమాండ్ ఉన్నా రెప్పపాటు కరెంట్‌కు అంతరాయం లేకుండా విద్యుత్ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. దీంతో రైతులు సైతం ముందస్తు సాగుకు ప్రణాళికలు రూపొందించి దానికి తగ్గట్టుగానే పంటలను పండిస్తుండడంతో డిమాండ్ సైతం ప్రతి సంవత్సకం పెరుగుతూ వస్తోంది.
ఈసారి ముందస్తు సాగుకాళేశ్వరం ప్రాజెక్టు,లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం లను పెద్ద ఎత్తున నిర్మించడం ద్వారా రాష్ట్రంలో సాగు నీటి సమస్య పూర్తిగా తగ్గిపోయింది.

అంతేకా కుండా రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవడంతో భూగర్భ జలాల మట్టాలు సైతం పెరిగాయి. ఈ నేపథ్యంలోనే సాగునీటి వనరులు, విద్యుత్ సరఫరా నిరంతరాయంగా ఉండడంతో వరి పంటతో పాటు ఇతర పంటలను రైతులు సాగు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే గతంలో మాదిరిగా కాకుండా ఈసారి యాసంగి వరి పంటలను ముందుగానే రైతులు సాగు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వానాకాలం పంటను పూర్తిగా కొనుగోలు చేయడంతో కొనుగోలుకు సంబంధించి ఇబ్బందులు లేకుండా చేయడంతో పాటు ఈసారి ముందస్తు సాగు చేయడంలో రైతులు అధికంగా ఆసక్తి చూపారు.
ప్రతి జిల్లాలో 250 నుంచి 500 మెగావాట్ల వరకు…
అయితే విద్యుత్ వినియోగం వ్యవసాయ రంగానికి రోజురోజుకు పెరుగుతోంది. గత సంవత్సరం ఇదే సమయంలో ఉన్న విద్యుత్ డిమాండ్ ఈ సంవత్సరం అంతకు మించి పెరిగిపోయింది. గత సంవత్సరం ఉమ్మడి మెదక్ జిల్లాలో 1056మెగా వాట్స్ ఉండగా, గురువారం 1356 మెగా వాట్స్‌గా నమోదయ్యింది. గత సంవత్సరం ఉమ్మడి నల్గొండ జిల్లాలో 1220 మెగా వాట్స్ ఉండగా, ఈసారి 1668 మెగా వాట్స్‌గా నమోదయ్యింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 820 మెగావాట్స్‌గా, ఈ సంవత్సరం 1201 మెగావాట్స్‌గా, గత సంవత్సరం ఉమ్మడి వరంగల్ జిల్లాలో 455 మెగావాట్స్‌గా,

గురువారం 789 మెగావాట్స్‌గా, ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో గతంలో 1057 మెగావాట్స్‌గా నమోదు కాగా, ప్రస్తుతం 1057 మెగావాట్స్, ఉమ్మడి నిజామాబాద్‌లో గత సంవత్సరం 551 కాగా, ఈసారి 754 మెగావాట్స్‌గా, ఉమ్మడి ఖమ్మంలో గత సంవత్సరం 356గా, ప్రస్తుతం 389 మెగావాట్స్‌గా, ఉమ్మడి జిహెచ్‌ఎంసి పరిధిలో గతంలో 2151 మెగావాట్స్‌గా, ఈసారి 2297 మెగావాట్స్ డిమాండ్‌గా నమోదయ్యిందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. దాదాపు ప్రతి జిల్లాలో 250 మెగా వాట్స్ నుంచి 500 మెగా వాట్ల వరకు విద్యుత్ వినియోగం పెరిగిందని విద్యుత్ అధికారులు పేర్కొన్నారు. ఈసారి ముందస్తు సాగు చేయడంతోనే ఈ డిమాండ్ పెరిగిందని విద్యుత్ అధికారులు తెలిపారు.
వ్యవసాయ రంగానికి రూ.36,890 కోట్ల సబ్సిడీ
2018 జనవరి 1 నుంచి వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత కరెంటు పథకాన్ని అమల్లోకి తీసుకురాగా, ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 26.96 లక్షల మంది వ్యవసాయ వినియోగదారులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ను సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. 2014 నుంచి 7.93 లక్షల వ్యవసాయ విద్యుత్ కనక్షన్లు, రైతులకు ఉచిత విద్యుత్ అందించడానికి వ్యవసాయ రంగానికి రూ.36,890 కోట్ల సబ్సిడీని ప్రభుత్వం అందించింది.

ఇది కాకుండా, రాష్ట్రంలోని అన్ని వర్గాల వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ను అందించేందుకు సరఫరా, పంపిణీ వ్యవస్థలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిదేళ్లలో రూ.37,099 కోట్లు ఖర్చు చేయడంతో పాటు 400 కెవి సబ్ స్టేషన్లలో 17,200 కెవి సబ్ స్టేషన్లలో 48,132 కెవి సబ్ స్టేషన్లలో 72, ఈహెచ్‌టీ సబ్ స్టేషన్లలో 137, 33/11 కెవి సబ్ స్టేషన్లలో 1038 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫారమ్ (డిటిఆర్)లను 3.65 లక్షల డిటిఆర్‌లను నిర్మించి విద్యుత్ సరఫరా, పంపిణీ వ్యవస్థలను పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా పటిష్ట పరిచింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News