Wednesday, January 22, 2025

ఈ వేసవిలో ఐస్‌క్రీమ్, కోలాకు డిమాండ్

- Advertisement -
- Advertisement -

విక్రయాలు రెండంకెల వృద్ధి: ఎఫ్‌ఎంసిజి, డైరీ కంపెనీల అంచనా

న్యూఢిల్లీ : ఈ వేసవి ముందుగానే ప్రారంభం కావడంతో ఐస్‌క్రీమ్‌లు, కోలా వంటి శీతల పానియాలకు డిమాండ్ పెరిగింది. దీని వల్ల ఉత్పత్తుల అమ్మకాలు పెరిగి రెండు అంకెల వృద్ధిని నమోదు చేస్తాయని ఎఫ్‌ఎంసిజి(ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్), డైరీ కంపెనీల ఉన్నతాధికారులు చెబుతున్నారు. కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టి సాధారణ పరిస్థితులు నెలకొనడంతో ఈ వేసవి సీజన్‌లో వినియోగదారుల నుంచి ఎక్కువ డిమాండ్ ఉండనుంది.

ఒహెచ్‌హెచ్(ఔట్ ఆఫ్ హోమ్) విభాగంలో రెండు సంవత్సరాల క్షీణత తర్వాత విక్రయాలు ఈసారి గణనీయంగా పెరుగుతాయని కంపెనీలు అంచనా వేస్తున్నాయి. ఈ డిమాండ్‌ను అందిపుచ్చుకునేందుకు కంపెనీలు సరికొత్త ఆఫర్లతో ప్రజల ముందుకు రావాలని చూస్తున్నాయి. పాల ఉత్పత్తులు, ఐస్‌క్రీమ్ తయారీ సంస్థ మదర్ డైరీ ప్రతినిధి మాట్లాడుతూ, ఉష్ణోగ్రతలు పెరగడంతో ఇప్పటికే డిమాండ్‌లో పురోగతి కనిపిస్తోందని, ఈ ట్రెండ్ వచ్చే రోజుల్లోనూ కొనసాగుతుందని అంచనా వేస్తున్నామని అన్నారు. ఈ ఏడాది వేసవిలో శీతల పానియాలకు గణనీయమైన డిమాండ్ ఉంటుందని అంచనా వేస్తున్నామని బివరేజ్ మేకర్ పెప్సికో పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News