Sunday, December 22, 2024

బైరి నరేష్‌ని వెంటనే అరెస్ట్ చేయాలంటూ రాస్తారోకో

- Advertisement -
- Advertisement -

నవీపేట్ : అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖలు చేసిన బైరి నరేష్‌ను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నవీపేట్ మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై అయ్యప్ప మాలదారులు, బిజెపి నాయకులు, పలు పార్టీల నాయకుల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. అయ్యప్ప స్వామి గురించి చులకన చేస్తూ అసభ్యకరంగా మాట్లాడిన బైరి నరేష్‌ను ఇప్పటి వరకు పోలీసులు అరెస్టు చేయకపోవడమా అంటూ నినాదాలు చేస్తూ రోడ్డుపై అయ్యప్ప మాలదారులు బైఠాయించారు.

రాస్తారోకో అనంతరం అయ్యప్ప దీక్ష స్వాములు, పలు పార్టీల నాయకులు ఎస్సై రాజారెడ్డికి బైరి నరేష్ పై ఫిర్యాదు చేశారు. బైరి నరేష్‌ను సత్వరమే అరెస్టు చేయకపోయినట్లయితే పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణకు పాల్పడవలసి వస్తుందని హెచ్చరించారు. బైరి నరేష్ పై వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.

గంట పాటు రోడ్డుపై అయ్యప్ప మాలదారులు మరియు బిజెపి నాయకులు బయటకించడంతో కిలో మీటర్ మేరా వాహనాలు నిలిచిపోయాయి. మండల కేంద్రంలో శుక్రవారం కూరగాయాల మార్కెట్ ఉన్నందున రాస్తారోకోను విరమిస్తున్నామని, లేనియెడల బైరి నరేష్‌ను ఆరెస్టు చేసే వరకు రాస్తారోకోను కొనసాగించే వారమని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో పలు పార్టీల నాయకులు అయ్యప్ప మాలదారులు, బిజెపి నాయకులు, పలు పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News