Tuesday, November 5, 2024

అంతర్జాతీయంగా పసుపు పంటకు డిమాండ్

- Advertisement -
- Advertisement -

Demand for Turmeric crop internationally

ఈ ఏడాది 2.30లక్షల టన్నుల ఎగుమతి లక్ష్యం
అగ్రస్థానంలో తెలంగాణ
సాంగ్లి మార్కెట్‌లో రూ.30వేల ధరతో ఆల్‌టైం రికార్డ్

హైదరాబాద్: అంతర్జాతీయ మార్కెట్‌లో పసుపు పంట బంగారంతో పోటీపడే స్ధాయికి చేరుకుంటోంది. ప్రపంచ వ్యాప్తంగా పసుపు పంట సాగు విస్తీర్ణం తగ్గుతూ రావటం. ఈ ఏడాది ప్రత్యకంగా నెలకొన్న కరో నా పరిస్థితుల ప్రభావం, మరో వైపు వంటకాల్లోనే కాకుండా, సౌందర్య పోషక, ఔషధ ఉత్పత్తుల రంగంలో కూడా పసుపు వినియోగం పెరుగుతూ వస్తుండటంతో పసుపు పంటకు క్రమేపి డిమాండ్ పెరుగుతూ వస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం పసుపు ఎగుమతి లక్ష్యాలను కూడా రెట్టిం పు పెంచి ఆ మేరకు పసుపు ఎగుమతుల ప్రణాళికను రూపొందించింది. 2021లో మొత్తం 2.30లక్షల టన్ను ల పసుపు ఎగుమతులు చేయాలని లక్షంగా పెట్టుకుం ది. గత ఏడాది జనవరి నుంచి డిసెంబర్ వరకూ దేశం నుంచి రికార్డు స్థాయిలో 1.81లక్షల మెట్రిక్ టన్నుల పసు పును విదేశాలకు ఎగుమతి చేసినట్టు కేంద్ర వాణిజ్య శాఖ ఒక నివేదికలో వెల్లడించింది.

2019తో పోలిస్తే ఏకంగా 36శాతం వృద్దిరేటు నమోదు కావటం గత దశాబ్ధకాలం లో ఇదే ప్రధమం అని అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రపంచ దేశాల్లో పండించే పసుపులో 80శాతం మనదేశంలోనే పండుతోంది. అందులోనూ తెలంగాణ రాష్ట్రం పసుపు సాగులో జాతీయ స్థాయిలోనే ప్రధమ స్ధానంలో నిలించింది. తెలంగాణలో 1.34లక్షల ఎకరాల్లో పసుపు పంటను పండిస్తున్నారు. నాణ్యమైన మేలు రకం పసుపు ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్ర రైతులు దేశంలోనే అగ్రస్థానం లో ఉన్నారు. దేశంలో 14లక్షల ఎకరాల్లో పంసుపు పంట సాగులో ఉంది. ఇందులో తెలంగాణ వాటా 24 శాతం ఉండగా, మహరాష్ట్రలో 9శాతం, తమిళనాడులో 12శాతం, ఏపిలో 10శాతం పంట సాగులో ఉన్నట్టు వ్యవ సాయ శాస్త్రవేత్త డా.బి.మహేందర్ పేర్కొన్నారు. తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లోనే పసుపు పంటను అదికం గా సాగుచేస్తున్నాయి. పంట దిగుబడి కూడా ఎకరానికి 25 క్లింటాళ్లమేరకు లభిస్తుంది. దీర్గకాలిక పంటగా సాగు లో ఉన్న పసుపు పంటకు గత ఏడాది జులై నుంచి మూడు నెలల పాటు కురిసిన అధిక వర్షాల కారణంగా పంట తెగుళ్లకుగురై ఆ ప్రభాతం పంట దిగుబడిపై పడింది. దీంతో పంట దిగుబడి కొంత తగ్గినట్టు రైతులు చెబుతున్నారు.

క్వింటా రూ.30వేలతో ఆల్‌టైం రికార్డ్

పసుపు ధరకు నాణ్యతే అధిక ప్రభావం చూపుతుంది. పుసుకులో ఉన్న కర్కుమిన్ నాణ్యతను నిర్దేశిస్తుంది. దేశంలో పసుపు పంట విక్రయాలకు అతి పెద్ద మార్కెట్‌గా ఉన్న మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్‌లో మంగళవారం క్వింటాలు పసుపు ధర రూ.30వేలు పలికింది. కర్ణాటకలోని బెళగావి జిల్లా గుర్లాపూర్‌కు చెందిన రైతు నేమగౌడర్ తన పొలంలో పండించిన సేలం రకం పసుపునే సాంగ్లి మార్కెట్‌కు తెచ్చాడు. పసుపు కొమ్ము నాణ్యత బంగారం కాంతులీనటంతో వ్యాపారుల కళ్లు జిగేల్‌మన్నా యి. మరోమాట లేకుండా క్వింటాలు పసుపు రూ.30వేలు ధర చెల్లించి కొనుగోలు చేశారు.దేశ చరిత్రలో పసుపు ధర ఇంత భారీగా రికార్డు కావటం ఇదే ప్రధమం అని వ్యాపారవర్గాలు పేర్కొన్నాయి. గత అయిదు రోజుల కిందట ఇదే మార్కెట్‌లో పసుపు ధర క్వింటాలు రూ.20వేలు పలికింది. సాధారణంగానే ఈ ఏడాది కరోన పరిస్థితుల ప్రభా వం పసుపై కూడా పడింది. మహారాష్ట్రలో క్వింటాలు సాధారణ రకం పసుపు రూ.16వేలకు చేరింది. తెలంగాణలోని నిజామాబాద్ మార్కెట్‌లో కూడా పసుపు ధరలు రూ.5వేలతో ప్రారభమై క్రమేపి పెరుగూతూ రూ.10,188 కి చేరుకున్నాయి.

గల్ప్ దేశాల్లో పెరిగిన వినియోగం

దేశంలోని పసుపు ఉత్పత్తుల్లో అధికశాతం ఎగుమతులు గల్ప్ దేశాలకే చేరుతున్నాయి. ఇరాన్ , ఇరాక్ తదతర గల్ప్ దేశాలతోపాటు జపాన్ జర్మని తదితర దేశాలకు అధికుంగా ఎగుమతులు జరుగుతన్నాయి. ఆహార పదార్ధాలు దీర్గకాలం మన్నెలా నిల్వకోసం పసుపును అధికంగా ఉపయోగిస్తున్నారు. మరో వైపు సబ్చులు, ముఖాలకు పూసుకునే క్రీమ్‌లు తదితర సౌందర్యపోషకాలతోపాటు, ఔషధ ఉత్పత్తుల తయారీలోనూ పసుపు వినియోగం పెరిగింది. దీంతో అంతర్జాతీయంగా పసుపు ధరలు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నట్టు వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News