Monday, December 23, 2024

రెంజర్ల రాజేష్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి

- Advertisement -
- Advertisement -

నవీపేట్ మండలంలోని యంచ గ్రామస్తులు బాసర ప్రధాన రహదారిపై చదువుల తల్లి సరస్వతీ దేవిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రెంజర్ల రాజేష్‌ను అరెస్ట్ చేయాలని మంగళవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. దేవిమాతపై అనుచిత వ్యాఖ్యలు చేసి హిందూ దేవతలను అవమానించిన హిందువుల మనోభావాలను దెబ్బతీసిన రెంజర్ల రాజేష్‌ను ఆరెస్టు చేసి పిడి యాక్టు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

హిందూ దేవతలు హిందూ మతస్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, లేనిచో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జన విజ్ఞాన వేదిక నాయకులు సంజీవ్, లాలు యాదవ్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News