Thursday, January 23, 2025

పెంచిన గ్యాస్ ధరలపై భగ్గుమన్న మహిళా కాంగ్రెస్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో మహిళలు ర్యాలీ, ధర్నా నిర్వహించారు. బిజెపి కార్యాలయ ముట్టడికి ప్రయత్నించారు. కేంద్రంలోని బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ నినాదాలు చేశారు. పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావ్‌లకు మధ్య తీవ్ర వాగ్వాదం అయ్యింది. అనంతరం పోలీసులు మహిళా కాంగ్రెస్ నాయకులను కార్యకర్తలను అరెస్టు చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

కాగా గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ అంబర్‌పేట లోని కోరంటి చౌరస్తాలో హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మోతా రోహిత్ ఆధ్వర్యంలో మహిళలు కేంద్ర మంత్రి స్మృతి ఇరాని మాస్కులు ధరించి ప్లకార్డులు ప్రదర్శిస్తూ వినూత్న నిరసన తెలిపారు. 2014లో గ్యాస్ ధర రూ.410 ఉన్నపుడు రోడ్లపైకి వచ్చి ధర్నా చేసిన స్మృతి ఇరాని ఈ రోజు సిలిండర్ ధర మూడింతలు పెరిగి రూ.1200 కు చేరుకున్నా స్పందించక పోవడం విడ్డూరమని రోహిత్ విమర్శించారు. కేంద్రంలో అధికారం ఇస్తే వెంటనే గ్యాస్ ధరలు తగ్గిస్తామని చెప్పని ప్రధాని 8 సంవత్సరాలైనా నిరంతరంగా గ్యాస్ ధరలను పెంచుకుంటూ పోతున్నాడని విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News