- Advertisement -
ఇటీవల ఢిల్లీలో జరిగిన నీతిఆయోగ్ సమావేశంలో ఇండియా భూటాన్ రివర్ కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసినట్టు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ సోమవారం అసెంబ్లీలో వెల్లడించారు. రాష్ట్రంలో భూమికోత నియంత్రణ, వరదల నివారణ చర్యలపై తీర్మానం చేసిన సందర్భంగా ఈ విషయాన్ని ప్రస్తావించారు. బెంగాల్ లోని రెండు జిల్లాలను, బీహార్ లోని మరికొన్ని జిల్లాలను కలిపి కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని, ఈశాన్యంలోని భాగంగా ఉత్తరబెంగాల్‌గా ఏర్పాటు చేయాలని కొంతమంది బీజేపీ నేతలు చేసిన డిమాండ్లను ముఖ్యమంత్రి మమత పట్టించుకోలేదు. బెంగాల్‌ను విడదీయడానికి ఎవరైనా ప్రయత్నిస్తే తాను అడ్డుకుంటానని మమతా బెనర్జీ స్పష్టం చేశారు.
- Advertisement -