- Advertisement -
ఛత్రపతి శంభాజీనగర్ : మరాఠా కోటా కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పుడు, దాన్ని అమలు చేయడానికి ఎందుకు ఎక్కువ సమయం అవసరమో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయాలని మరాఠా రిజర్వేషన్ ఉద్యమనేత మనోజ్ జరాంగే డిమాండ్ చేశారు. జరాంగే తన స్వగ్రామం అంతర్వలి శరతిలో నిరాహార దీక్ష సాగిస్తున్నారు. ఈ డిమాండ్‌ను సాధించడానికి ఎంత సమయం కావాలని నిలదీశారు. నిరాహార దీక్ష సాగిస్తున్న చోటకు ప్రభుత్వం వచ్చి తనతో చర్చలు జరపాలని అడిగారు. అఖిలపక్ష సమావేశంలో ఏం చర్చించారో ఆ వివరాలు తనకు అక్కరలేదని, ప్రభుత్వం సమయం కావాలని చెబుతోందని, ఎంత సమయం కావాలో చెప్పాలని ఆయన నిలదీశారు. ఆందోళన ప్రారంభమై 10 రోజుల తరువాత ప్రభుత్వం ఇప్పుడు సమయం కావాలంటోందని, అదే ముందుగా మేల్కొని సమయం అడిగితే బాగుండేదని వ్యాఖ్యానించారు.
- Advertisement -