Sunday, December 22, 2024

171 మిలియన్లకు పెరిగిపోయిన డీమ్యాట్ ఖాతాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ చేయాలంటే డీమ్యాట్ ఖాతాలు తప్పనిసరి. మనం కొన్న షేర్లు ఈ డీమ్యాట్ ఖాతాలోనే నిక్షిప్తంగా ఉంటాయి. అయితే ఈ ఏడాది తొలి ఎనిమిది నెలల్లో దాదాపు 3.2 కోట్ల డీమ్యాట్ ఖాతాలు కొత్తగా చేరాయి. అంటే మదుపరులు వాటిని కొత్తగా తెరిచారు. ఇండియాలో డీమ్యాట్ ఖాతాలు పెరుగుతూనే ఉన్నాయి. నేడు బ్యాంకులో పొదుపు కన్నా స్టాక్ ఎక్స్ఛేంజీల వైపే చాలా మంది మొగ్గుచూపుతున్నారు.

స్టాక్ మార్కెట్ లో లావాదేవీలు జరిపే వారికి డీమ్యాట్ ఖాతా ఉండాల్సిందే. నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్(ఎన్ఎస్ డిఎల్), సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్(సిడిఎస్ఎల్) లో ఉన్న మొత్తం డీమ్యాట్ ఖాతాలు ఆగస్టు నెలలో 171.1 మిలియన్లకు చేరాయి. 2024 నుంచి ప్రతి నెల నాలుగు మిలియన్ల కొత్త డీమ్యాట్ ఖాతాలు తెరుచుకుంటున్నాయి.  ఈ ఏడాది తొలి ఎనిమిది నెలల్లోనే 3.2 కోట్ల డీమ్యాట్ ఖాతాలు తెరుచుకున్నాయి. కొత్త ఐపిఓలు ఈ ఏడాది వచ్చినందున చాలా మంది డీమ్యాట్ ఖాతాలు తెరిచారని తెలుస్తోంది.ఐపిఓలో పాల్గొనేందుకే చాలా మంది డీమ్యాట్ ఖాతాలు తెరిచినట్లు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా(సెబీ) నిర్వహించిన అధ్యయనంలో తేలింది.

ఈ ఏడాది నిఫ్టీ 15 శాతం పెరిగింది. సెన్సెక్స్ 13 శాతం పెరిగింది. భారతీయ స్టాక్ మార్కెట్ పెరగడానికి కారణం మన ఆర్థిక వ్యవస్థ బలపడ్డమేనని తేలింది. ఇక భారత స్థూల జాతీయోత్పత్తి(జిడిపి) 2023-24 ఆర్థిక సంవత్సరంలో 8.2 శాతం, 2024-25 ఆర్థిక సంవత్సరంలో 7.2 శాతం పెరిగింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News