Sunday, December 22, 2024

162 మిలియన్లకు పెరిగిన డీమ్యాట్ ఖాతాలు

- Advertisement -
- Advertisement -

ఎన్ఎస్ఈలో యాక్టివ్ క్లయింట్లు 44.2 మిలియన్లు

ముంబై: జూన్ నెలలో 162 మిలయన్లకు (16 కోట్ల 20 లక్షలకు) డీమ్యాట్ ఖాతాలు పెరిగాయి.  నెలవారీ (మంత్ టు మంత్) లెక్కన 4.2 మిలియన్లు పెరిగాయని గురువారం ఓ రిపోర్టు వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 3.4 మిలియన్లు అదనంగా చేరాయి.

జూన్ నెలలో సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్ (సిడిఎస్ఎల్) మార్కెట్ వాటాను పెంచుకుందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పేర్కొంది. ఇక ఇయర్ ఆన్ ఇయర్ ప్రతిపదికన నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్ఎస్ డిఎల్) మార్కెట్ వాటాను 420బిపి/620బిపి కోల్పోయిందని ఆ రిపోర్టు పేర్కొంది. ఇకపోతే నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ లో జూన్ నాటికి యాక్టివ్ క్లయింట్లు 3.1 శాతం పెరిగి 44.2 మిలియన్లకు చేరుకున్నారు. ప్రస్తుతం ఎన్ఎస్ఈ లో టాప్  ఐడు డిస్కౌంట్ బ్రోకర్లు 64.4 శాతం వాటా కలిగి ఉన్నారు. అదే 2022 జూన్ లో అయితే వారి వాటా 58.2 శాతం ఉండింది.

ఆన్ బ్రోకరేజ్ జిరోదా తన క్లయింట్లను 2.1 శాతాం పెంచుకుని 7.7 మిలియన్ కలిగి ఉంది. ఇక గ్రో సంస్థ తన క్లయింట్లను 5.4 శాతం పెంచుకుని 10.9 మిలియన్లను కలిగి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News