Tuesday, December 24, 2024

ఏడాది కాలంలో 41 శాతం పెరిగిన డీమ్యాట్‌ ఖాతాలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ:  దేశంలో స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య పెరుగుతున్నది. దీని ఫలితంగానే డీమ్యాట్‌ ఖాతాలు అక్టోబర్‌ నెలాఖరుకు ఖాతాల సంఖ్య 1.04 కోట్లకు చేరుకున్నాయి. గత ఏడాది ఈ సంఖ్య 74 లక్షలుగా ఉండేది. అంటే ఏడాది కాలంలో డీమ్యాట్‌ ఖాతాల సంఖ్య 41 శాతం పెరిగాయన్నమాట. అయితే, గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే మాత్రం ఈ అక్టోబర్‌లో ఈ ఖాతాల సంఖ్య 18 లక్షలకు పడిపోవడం విశేషం. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నివేదిక ప్రకారం, ఆగస్టు నెల నుంచి డీమ్యాట్ ఖాతాల సంఖ్యలో పెరుగుదల వేగం తగ్గుతున్నది. ఆగస్టులో 26 లక్షల కొత్త ఖాతాలు రాగా,  సెప్టెంబర్‌లో 20 లక్షలు, అక్టోబర్ నెలలో 18 లక్షలకు తగ్గిపోయాయి. గత ఏడాది అక్టోబర్ నెలలో 36 లక్షల డీమ్యాట్ ఖాతాలు ప్రారంభమయ్యాయి.

ఆసియాలో తొలి, ఏకైక లిస్టెడ్ డిపాజిటరీ సంస్థ సిడిఎస్‌ఎల్‌ ప్రకారం, 2022-23 ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో 48 లక్షలకు పైగా కొత్త డీమ్యాట్ ఖాతాలు తెరువబడ్డాయి. నెలవారీ ప్రాతిపదికన చూస్తే,  సెప్టెంబర్‌లో 10.3 కోట్లుగా ఉన్న డీమ్యాట్ ఖాతాల సంఖ్య సమీక్షలో ఉన్న నెలలో కేవలం 2 శాతం మాత్రమే పెరిగాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News