Wednesday, January 22, 2025

ప్రమాదంలో ప్రజాస్వామ్యం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల నుం చి 146 మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ప్రతిపక్ష ఇండియా కూటమికి చెందిన ఎంపీలు శుక్రవారం న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రదర్శన నిర్వహించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలంతా సమై క్యం కావాలని ఇండియా కూటమి నాయకులు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ యా) నిర్వహించిన ఈ నిరసన ప్రదర్శనలో కాం గ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, వామపక్షాలు, డిఎం కె, ఎన్‌సిపి, ఎస్‌పి, ఎన్‌సి, టిఎంసి, జెఎంఎం, ఆర్‌జెడి, ఇండియా కూటమికి చెందిన ఇతర భాగస్వామ్య పక్షాలకు చెందిన ఎంపిలు, నాయకులు పాల్గొన్నారు. సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ బిజె పి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడినందునే ఇండియా కూటమి పార్టీల నాయకులు చేతులు కలిపారని తెలిపారు.

అందరూ సమైక్యమైతే ప్రధాని నరేంద్ర మోడీ ఏమీ చేయలేరని ఆ యన అన్నారు. మీరు ఎంతగా మమల్ని అణచివేయాలని ప్రయత్నిస్తే అంతగా పైకి లేస్తామని ఆ యన చెప్పారు. దేశాన్ని, ప్రజాస్వామాన్ని రక్షించేందుకు తాము సమైక్యంగా పోరాడుతున్నామని ఆయన చెప్పారు. ప్రతిపక్షం గొంతు నొక్కేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా ప్రతిపక్ష ఎంపిలందరూ పోరాడాలని ఖర్గే పిలుపునిచ్చారు. తనను మిమిక్రీ చేసిన టిఎంసి ఎంపీ గు రించి రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖర్ కుల ప్రస్తావన తేవడం తగదని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా మాట్లాడే హక్కు ఉంటుందని, పార్లమెంట్‌లో తాము నోటీసు ఇస్తే దానికి అవకాశాన్ని కూడా ఇవ్వడం లేదని ఖర్గే ఆరోపించారు. రాజ్యాంగ పదవిలో ఉన్న మీరు(ధన్‌ఖర్) ఆక్రో శం వ్యక్తం చేస్తారు. గురించి మీరు మాట్లాడతారు. ఒక దళితుడు మాట్లాడేందుకు బిజెపి ప్ర భుత్వం అవకాశం ఇవ్వడం లేదని మమల్ని అనమంటారా?మా నుంచి మాటాడే హక్కును మీరు తీసుకోలేరు అని ఖర్గే స్పష్టం చేశారు.
బిజెపి ఎంపిలు పరుగులు: రాహుల్
పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యం ఘటన జరిగినప్పుడు సభలో ఉన్న బిజెపి ఎంపిలు భయంతో బయటకు పరుగులు
తీశారని ఆ సయంలో సభలోనే ఉన్న రాహుల్ గాంధీ వెల్లడించారు. డిసెంబర్ 13న పార్లమెంట్ విజిటర్స్ గ్యాలరీలోకి ప్రవేశించిన ఇద్దరు వ్యక్తులు లోక్‌సభ ఛాంబర్‌పైకి దూకి స్మోక్ బాంబు ప్రయోగించిన ఘటనను రాహుల్ గాంధీ జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసన ప్రదర్శనలో వివరించారు. ఆ ఇద్దరు వ్యక్తులు స్మోక్ బాంబును ప్రయోగించిన వెంటనే బిజెపి ఎంపిలు పరుగు లంఘించుకున్నారని రాహుల్ చెప్పారు. బిజెపి ఎంపిలందరూ బయటకు పరుగులు తీశారు. వారి భయంతో వణికిపోయారు అని రాహుల్ చెప్పారు. అయితే పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యం ఘటనతో అసలు చొరబాటుదారులు ఎందుకు ఆ చర్యకు పాల్పడవలసి వచ్చిందన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయని రాహుల్ అన్నారు.

ఈ సంఘటనలో పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యం అన్న ప్రశ్న ఉంది. అదే సమయంలో చొరబాటుదారులు ఎందుకు ఈ విధంగా నిరసన తెలియచేశారన్న మరో ప్రశ్న కూడా ఉంది. దీనికి సమాధానం దేశంలోని నిరుద్యోగం అని రాహుల్ వ్యాఖ్యానించారు.
ఆ తర్వాత వరుసగా జరిగిన పరిణామాలను రాహుల్ వివరించారు. ఆ ఘటన తర్వాత పార్లమెంట్‌లో ప్రతిపక్ష సభ్యుల నిరసనలు, సభా కార్యకలాపాల అడ్డగింత, సభ్యుల మూకుమ్మడి సస్పెన్షన్లు జరిగాయని ఆయన చెప్పారు. అయితే ఆ తర్వాత రాజ్యసభ చైర్మన్, ఉప రాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖర్‌ను టిఎంసి ఎంపి కల్యాణ్ బెనర్జీ మిమిక్రీ చేయడం, దాన్ని తాను వీడియో తీయడం పెద్ద వివాదంగా మారిపోయిందని ఆయన అన్నారు. దేశంలో నిరుద్యోగం గురించి మీడియా మాట్లాడదు. కాని పార్లమెంట్ వెలుపల సస్పెన్షన్‌కు గురైన ఎంపీలు ధర్నా చేస్తుండగా రాహుల్ గాంధీ వీడియో తీయడం గురించి మాట్లాడుతుంది అంటూ రాహుల్ చురకలు వేశారు. పార్లమెంట్‌లో డిసెంబర్ 13న సంభవించిన భద్రతా వైఫల్యం ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ నుంచి సమాధానాలు కోరినందుకే లోక్‌సభ, రాజ్యసభ నుంచి ప్రతిపక్షఎంపీలను సస్పెండ్ చేశారని రాహుల్ గాంధీ తెలిపారు. బిజెపి ఎంత ఎక్కువగా విద్వేషాన్ని వ్యాప్తి చేస్తే ఇండియా కూటమి పార్టీలు అంతకన్నా ఎక్కువగా సోదరభావాన్ని వ్యాప్తి చేస్తాయని రాహుల్ చెప్పారు. పార్లమెంట్ నుంచి 150 మంది ఎంపీలను గెంటివేయడం ద్వారా 60 శాతం మంది భారతీయుల గొంతును అణచివేసిందని ఆయన ఆరోపించారు. నిరసన ప్రదర్శనలో పాల్గొన్న వారిలో సీతారాం ఏచూరి(సిపిఎం), డి రాజా(సిపిఐ), మహువా మాజి(జెఎంఎం), తిరుచి శివా(డిఎంకె), మనోజ్ కుమార్ ఝా(ఆర్‌జెడి), మౌసమ్ నూర్(టిఎంసి), హస్నిన్ మసూది(ఎన్‌సి), ఎన్‌కె ప్రేమచంద్రన్(రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ), ఎస్‌టి హసన్(ఎస్‌పి) తదితరులుఉన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News