Wednesday, January 22, 2025

ప్రజాస్వామ్యానికి అంతిమ సంస్కారాలు

- Advertisement -
- Advertisement -

భారత దేశంలో ప్రజాస్వామ్యం ఒక క్రమ పద్ధతి ప్రకారం విధ్వంసమైపోతోంది.ఇక దాని అంతిమ సంస్కారాలే మిగిలాయి అని ప్రముఖ రచయిత్రి, బుకర్ అవార్డు గ్రహీత అరుంధతీ రాయ్ అన్నారు. స్వీడన్ రాజధాని స్టాక్ హోవ్‌ులో గత నెల ఆమె చేసిన ప్రసంగంలో సంక్షిప్తంగా కొంత భాగం. ‘గోటెన్ బర్గ్ పుస్తక ప్రదర్శనలో పాల్గొనడానికి కిందటిసారి, 2017లో స్వీడన్‌కు వచ్చా ను.ఈ పుస్తక ప్రదర్శనలో మితవాద పత్రిక ‘నయీ టైడర్’ను పెట్టినందుకు దీన్ని బహిష్కరించమని చాలా మంది నన్ను కోరారు. అలా బహిష్కరించడం సరికాదని వారికి నచ్చచెప్పాను. ఎందుకంటే, ప్రపంచ వేదికపైకి నా దేశ ప్రధాని నరేంద్ర మోడీని ఘనం గా ఆహ్వానిస్తున్న సందర్భం అది. హిందూ ఆధిపత్య మితవాద సంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌లో ఆయన జీవితకాల సభ్యుడు. నల్ల చొక్కాలు ధరించిన ముస్సోలినీ జాతీయ ఫాసిస్టు పార్టీ పార్లమెంటరీ విభా గం ఆదర్శంగా ఏర్పడిన సంస్థ అది. భారత ప్రధానిగా నరేంద్ర మోడీ తొమ్మిదవ ఏడు కొనసాగుతోంది.

ప్రజాస్వామ్యం దిగజారిపోతున్న భారత దేశం గురించి నేనిప్పుడు మాట్లాడదలుచుకున్నాను. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమని అంతా అనుకుంటున్నారు. అక్కడే నేను జీవిస్తున్నాను, ఆ ప్రాంతాన్ని నేను ప్రేమిస్తున్నాను. ప్రతి రోజూ అక్కడ నా గుండె బద్దలవుతోంది. దాన్ని బాగు చేయాలి. నేనేమీ సాయం చేయమని కోరడం లేదు. ఇప్పటికే లోపభూయిష్టమైన నా దేశం గురించి చెప్పదలుచుకున్నాను. సహనంలో, సంతోషంలో, సంతృప్తిలో, భిన్నత్వంలో నిలదొక్కుకోవడంలో ఒకప్పుడు పశ్చిమదేశాల కంటే భిన్నంగా ఉన్న దేశం మాది. ఆ ఆశలన్నీ ఇప్పుడు ఆవిరైపోయా యి. భారత ప్రజాస్వామ్యం ఒక క్రమపద్ధతిలో విధ్వంసమైపోతోంది. ఇక దాని అంతిమ సంస్కారాలే మిగిలిపోయాయి. మా రంగురంగుల ఎన్నికలను, మా అరుపులను వచ్చే ఏడాది మీరు చూడవచ్చు.

మా క్రీడాస్థలిలో ఏదీ స్పష్టంగా ఉండదు. నిష్పక్షపాతమైన ఎన్నికలకు మౌలికాంశాలు డబ్బు, డేటా, మీడియా, ఎన్నికల నిర్వహణ, భద్రతా యంత్రాంగం అంతా పాలక పార్టీ చేతిలోనే ఉన్నాయి. స్వీడన్‌కు చెందిన విడెవ్‌ు ఇన్‌స్టిట్యూట్ చేసిన తులనాత్మక అధ్యయనంలో భారత దేశం ‘ఎన్నికల నియంతృత్వ’ దేశంగా తయారైందని పేర్కొంది. ఎల్‌సాల్వడార్, టర్కీ, హంగరీ కంటే దారుణంగా తయారైందని స్పష్టం చేసింది. ప్రజాస్వామ్యం నుంచి ఏక స్వామ్యంలోకి నూట నలభై కోట్ల మంది ప్రజలు జారిపోతున్నారని, అంతకంటే దారుణంగా ఉందని మేం మాట్లాడుకుంటున్నాం. మోడీ, ఆర్‌ఎస్‌ఎస్ అధికారంలోకి రాక ముందే ప్రజాస్వామ్య విధ్వంసం మొదలైంది. ప్రధానిగా మోడీ అధికారం చేపట్టినప్పటి నుంచి, ఈ తొమ్మిది సంవత్సరాల్లో దేశం గుర్తుపట్ట లేనంతగా మారిపోయింది.

భారత రాజ్యాంగంలో పేర్కొన్న లౌకిక, సామ్యవాద, గణతంత్ర రాజ్యం మనుగడ సాగించడం లేదు. సామాజిక న్యాయం కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం జరిగే ఉద్యమాలను అణచివేశారు.ఎండిపోతున్న నదుల గురించి, పడిపోతున్న నీటి మట్టం గురించి, అదృశ్యమౌతున్న అడవి గురిం చి, కరిగిపోతున్న హిమానదాల గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. తక్షణం ఎదురయ్యే భయాల స్థానంలో ఇవి చేరిపోయా యి. ఏ రకమైన సైద్ధాంతిక మార్గంలో ఉన్నారన్న దానిపైనే ఆనందాతిరేకలు ఆధారపడ్డాయి. కార్పొరేట్ దేశంగా, హిందూ మత రాజ్యంగా, పోలీసు రాజ్యంగా,

భయపెట్టే దేశంగా భారత దేశం తయారైంది. గత పాలనలోనే వ్యవస్థలన్నీ, ముఖ్యంగా మీడియా ఖాళీ అయిపోయింది. హిందూ ఆధిపత్యంతో నిండిపోయాయి. స్వేచ్ఛా విపణి ఏం చేయాలో అది చేసేసింది. ఆక్స్‌ఫావ్‌ు నివేదిక 2023 ప్రకారం దేశంలోని 40 శాతం సంపద, జనాభాలో ఉన్న ఒక్క శాతం చేతిలో ఉంది. కేవలం 3 శాతం సంపద మాత్రమే సగం జనాభాకు చేరింది. పేద ప్రజలతో నిండిన ధనిక దేశం మాది. ఎవరైతే వాటికి బాధ్యులో వారు అసమాతలు సృష్టించి, ప్రజల ఆగ్రహాన్ని భారత దేశపు మైనారిటీలపైకి మళ్ళిస్తున్నారు. భారత దేశ జనాభాలో 14 శాతం మంది ఉన్న ముస్లింలు, బాధితుల్లో మొదటి వరుసలో ఉన్నారు.
‘ఇండియా: ద మోడీ క్వశ్చన్’ అనే రెండు భాగాల డాక్యుమెంటరీని బిబిసి గత జనవరిలో విడుదల చేసింది. గుజరాత్ రాష్ర్ట శాసన సభకు 2002లో జరగనున్న ఎన్నికలకు ముందు ఫిబ్రవరి, మార్చిలో ముస్లింలకు వ్యతికంగా జరిగిన మారణకాండ గురించి బ్రిటిష్ విదేశీ వ్యవహారాల కార్యాలయం ఆంతరంగికంగా రూపొందించిన ఈ వీడియోను మొదటి సారిగా బహిరంగ పరిచారు. ఈ నిజ నిర్ధారణ నివేదికపైన ఆంక్షలు విధించారు. సామూహిక అత్యాచారం, హింస జరుగుతున్నదని ఏళ్ళ తరబడి చెపుతున్న వాస్తవాన్ని సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టులు, న్యాయవాదులు, ఇద్దరు పోలీసు అధికారులు, ప్రత్యక్ష సాక్షులు ఈ నివేదికలో ధ్రువీకరించారు. దాదాపు రెండు వేల మంది హత్యకు గురయ్యారని ఆ నివేదిక అంచనా. “ఈ ప్రక్షాళన అంతా జాతిని శుభ్ర పరచడానికి” అని చెప్పే ఈ కార్యక్రమం అంతా ముందస్తు పథకం ప్రకారం జరిగింది.

విశ్వసనీయ సమాచారం ప్రకారం హత్యలు జరుగుతున్నప్పుడు మిన్నకుండమని పోలీసుల కు ఆదేశాలందాయి. ఈ మారణకాండ అంతా మోడీ కనుసన్నలలోనే జరిగిందని ఆ నివేదిక ఆరోపణ. భారత దేశంలో ఈ వీడియోని నిషేధించారు. ఈ మేరకు ట్విట్టర్, యూ ట్యూబ్‌కు ఆదేశాలు జారీకావడంతో వెంటనే వారు దాన్ని అమలు చేశారు. ఫిబ్రవరి 21వ తేదీన బిబిసి కార్యాలయాన్ని పోలీసులు, ఆదాయ పన్ను శాఖాధికారులు చుట్టుముట్టారు. ఆక్స్‌ఫావ్‌ు కార్యాలయం, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ కార్యాలయాన్ని, ప్రధాన ప్రతిపక్ష నాయకుల ఇళ్ళను, ప్రభుత్వంతో కలవని ఎన్జీవోల కార్యాలయాలను కూడా చుట్టుముట్టారు. 2002లో జరిగిన ఈ మారణకాండలో చట్టపరంగా మోడీ నిర్దోషిగా సుప్రీంకోర్టు క్లీన్‌చిట్ ఇవ్వడంతో, ఆయనపైన ఆరోపణలు చేసిన సామాజిక కార్యకర్తలు, పోలీసు అధికారులు ఇబ్బందిలోపడ్డారు.

ఫలితంగా సాక్ష్యాలు చెప్పిన వారు జైళ్ళలో ఉన్నారు. కొందరు కేసులను ఎదుర్కొంటున్నారు. హంతకులు బెయిల్‌పైన కాని, పెరోల్ పైన కాని బైట ఉన్నారు. స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పదకొండు మంది నేరస్థులు జైలు నుంచి దర్జాగా బైటికి వచ్చేశారు. పందొమ్మిదేళ్ళ ముస్లిం మహిళ బిల్కిస్ బానుపైన సామూహిక అత్యాచారంచేసి, ఆమె కళ్ళముందే ఆమె కుటుంబ సభ్యులు 14 మందిని దారుణంగా హత్య చేసిన కేసులో వీరికి జీవిత ఖైదు పడింది. మూడేళ్ళ వయసున్న బిల్కిస్‌బాను మేనకోడలు సలేహా తలను నేలకోసి కొట్టి చంపారు. ఇలాంటి నేరాలు చేసిన వారికి ప్రత్యేక క్షమాభిక్ష పెట్టారు. జైలు నుంచి విడుదలై వచ్చిన వీరిని పెద్ద హీరోలను చేసి బైట ఘనంగా సత్కరించారు.

త్వరలో గుజరాత్ రాష్ర్ట శాసన సభకు ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి నరహంతకులకు ఇలా ప్రత్యేక క్షమాభిక్ష ప్రసాదించడమనేది మన ప్రజాస్వామ్య ప్రక్రియలో ఒక భాగం! భారతదేశంలోఉన్నది భావప్రకటనా స్వేచ్ఛ కాదు. ప్రధాన టీవీ ఛానళ్ళ యాంకర్లు యథేచ్ఛగా అబద్ధాలాడతారు. మైనారిటీలను దయ్యాలని అమానవీయంగా చిత్రించి, వారిని భౌతికంగా దెబ్బతీస్తారులేదా జైలుపాలు చేస్తారు. హిందూ భగవంతుడికి ప్రతిరూపాలమని భావించేవారు, కత్తులు పుచ్చుకుని ప్రదర్శనలు చేసేవారు ముస్లిం మహిళలను మానభంగం చేయమని, వారిపై మారణ హోమం సాగించమని పిలుపునిస్తారు. పట్టపగలే దళితులను, ముస్లింలను పట్టుకుని కొట్టి, ఆవీడియోలను యూట్యూబ్‌లోపెడతారు. చర్చిలపైన యథేచ్ఛగా దాడి చేస్తారు. చర్చి ఫాదర్లను, నన్‌లను కొట్టి అవమాస్తారు.

స్వయం నిర్ణయాధికార హక్కు కోసం మూడు దశాబ్దాలుగా కశ్మీరీలు పోరాడుతున్నారు. కశ్మీర్‌లో భారత ప్రభుత్వం మిలిటరీ పాలనను సాగిస్తోంది. ఏ విదేశీ జర్నలిస్టునీ అక్కడికి అనుమతించడం లేదు. తమకు తాముగా ఆన్‌లైన్ సహా అన్ని రకాల ఉపన్యాసాలను ఆపేసేలా చేసింది. స్థానిక జర్నలిస్టులను జైళ్ళలో పెట్టిం ది. అందమైన కశ్మీరిలోయ సమాధులతో నిండిపోయింది. ‘కశ్మీర్‌లో కొందరు చచ్చిపోయారు, కొందరు బతికున్నారు. బతికున్నామని భావించేవారు నిజంగా మరణించినట్టు భావిస్తున్నారు’ అని కశ్మీరి ప్రజలంటున్నారు. భారత దేశంలో ఉండే ‘డెమోక్రసీ’ని ‘డామోన్ క్రేజి’ (వెర్రి దెయ్యం) అంటున్నారు. మోడీ రెండవ సారి 2019లో అధికారంలోకి వచ్చాక జమ్మూకశ్మీర్ రాష్ర్టం తన హోదాను కోల్పోయింది. రాజ్యాంగం కల్పించిన స్వయంప్రతిపత్తిని తొలగించారు.

తరువాత పౌరసత్వం సవరణ చట్టాన్ని పార్లమెంటు ఆమోదించింది. ఇది ముస్లింలకు వ్యతిరేకంగా రూపొందించింది.ఈ చట్టం వల్ల తమ పౌరసత్వాన్ని కోల్పోతామని ముస్లింలు భయపడుతున్నారు. పౌరసత్వ సవరణ చట్టం, పౌరసత్వ నమోదు చట్టం రావడానికి దారితీసింది. జర్మనీ ప్రజల కోసం నాజీ జర్మనీ రూపొందించిన న్యూరెంబర్గ్ చట్టాన్ని పోలినట్టు పౌరసత్వ నమోదు చట్టంలో తమ పేరు నమోదు చేసుకోవాలంటే ప్రభుత్వం ఆమోదించిన డాక్యుమెంట్లను సమర్పించాలని ప్రజలు భావిస్తున్నారు. ఇప్పటికే అసోంలో ఇరవై లక్షల మంది ప్రజలు జాతీయ పౌరసత్వ నమోదులో చోటు లేకుండా చేయడంతో పౌరులుగా తమ హక్కును కోల్పోయారు. భవిష్యత్తులో ఖైదీలుగా జైలు పాలు కాబోయే కష్ట జీవుల చేత నిర్బంధ కేంద్రాలను నిర్మిస్తున్నారు. వీరంతా విదేశస్థులుగా ముద్రపడడిన వారు, ఓటర్లు కాదని అనుమానం వ్యక్తం చేసినవారు.

నవ భారత దేశం రకరకాల దుస్తులతో దృశ్యమానమైంది. అహ్మదాబాద్‌లో లక్ష 32 వేల మంది కూర్చుని వీక్షించగలిగే క్రికెట్ స్టేడియానికి నరేంద్ర మోడీ స్టేడియం అని నామకరణం చేశారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను సన్మానించడానికి జనవరి 2020లో ఏర్పాటు చేసిన ‘నమస్తే ట్రంప్’ ర్యాలీ సభ్యులతో కిక్కిరిసిపోయింది. ఎక్కడైతే 2002లో పట్టపగలు ముస్లింలపై మారణకాండ జరిగి, వేలాది మంది తమ ఇళ్ళను ఒదిలిపెట్టి వెళ్ళిపోయారో, ఇప్పటికీ కొందరు ముస్లింలు ఎక్కడైతే నివసిస్తున్నారో, అక్కడ నుంచే ట్రంప్, మోడీ ప్రజలకు చేతులూపారు. భారత దేశం భిన్నత్వానికి, సహనానికి మారు పేరని ట్రంప్ అక్కడి నుంచే పొగిడారు. చప్పట్లు కొట్టమని మోడీ కోరడంతో స్టేడియం చప్పట్లతో మారుమోగిపోయింది. ట్రంప్ ఢిల్లీకి వచ్చిన మరునాడే అక్కడ మరో మారణకాండ జరిగింది.

గుజరాత్‌తో పోల్చుకుంటే ఈ మారణకాండ చాలా చిన్నది. ట్రంప్ బస చేసిన హోటల్‌కు కిలోమీటరు దూరంలో హిందుత్వవాదులు మరొక సారి ముస్లింలపైన పడ్డారు. పోలీసులు కళ్ళప్పగించి చూస్తూనే ఉన్నారు. ముస్లింలకు వ్యతిరేకంగా తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రదర్శనకారులపైన విరుచుకుపడ్డారు. ఈ ఘర్షణలో యాభై మూడు మంది మరణించగా, వందలాది ఇళ్ళు, మసీదులు, షాపులు తగలబెట్టారు. ట్రంప్ ఏమీ మాట్లాడలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News