అమరావతి: ఈ 76 ఏళ్ల ప్రయాణంలో దేశంలో ఎంతో పురోగమించిందని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర వేడుకలలో సిఎం జగన్ మోహన్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎపి అభివృద్ధి, సంక్షేమాన్ని వివరిస్తూ శకటాల ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వ్యవసాయం, పరిశ్రమ, సేవారంగంలో సుదీర్ఘమైన ప్రగతి సాధించామన్నారు. గ్రామ సచివాలయాలు, ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు, విలేజ్ క్లీనిక్‌లతో 50 నెలల్లోనే గ్రామ స్వరాజ్యానికి అర్థం తీసుకొచ్చామన్నారు. నిర్మాణంలో బ్రాడ్ బ్యాండ్, డిజిటల్ లైబ్రరీలు ఉన్నాయని, లంచాలు లేకుండా వివక్షకు తావులేకుండా పేదలకు చేయూత ఇవ్వాలని జగన్ పిలుపునిచ్చారు.
Also Read: కూల్ బీర్ కోసం తల పగలకొట్టుకున్నారు
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నామని, వికేంద్రీకరణలో సరికొత్త అధ్యాయనాన్ని ప్రారంభించామన్నారు. ఏ ప్రభుత్వం చేయని విధంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని జగన్ ప్రశంసించారు. పెత్తందారి భావజాలంపై తమ ప్రభుత్వం యుద్ధ చేస్తుందని జగన్ మండిపడ్డారు. ప్రజాస్వామ్యానికి నిజమైన అర్థం నవరత్నాలు పాలన అని కొనియాడారు. 99.05 శాతం హామీలను అమలు చేశామని స్పష్టం చేశారు. పంట నష్టపోతే ఆ సీజన్‌లోనే పరిహారం ఇస్తామని చెప్పారు. ఆక్వా జోన్లలో ఉన్న రైతులకు రూపాయిన్నరకే విద్యుత్ ఇస్తామని జగన్ వెల్లడించారు. పాల రైతుల కోసం పాలవెల్లువ కార్యక్రమం చేపట్టామని పేర్కొన్నారు.