Sunday, December 22, 2024

ప్రజాస్వామ్యం గెలిచింది: కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో పాలనా సర్వీసులపై అధికారాలు స్థానికంగా ఎన్నికైన ప్రభుత్వానికే ఉంటాయంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీపార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ హర్షం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్య విజయమని పే ర్కొంటూ ట్వీట్ చేశారు. ఢిల్లీ ప్రజలకు న్యాయం జరిగిందంటూ సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు.తాజా తీర్పుతో దేశ రాజధానిలో అభివృద్ధి మరింత వేగవంతమవుతుందన్నారు. రాష్ట్రప్రభుత్వ కార్యకలాపాలకు అడ్డు తగులుతున్న అధికారులు తగిన మూల్యం చెల్లించుకోవలసి ఉంటుందని హెచ్చరించారు. మరో వైపు అధికారుల నియామకాలు, బదిలీల అధికారం ఇప్పుడు రాష్ట్రప్రభుత్వానికి దక్కిందని ఆమ్ ఆద్మీ పార్టీ పేర్కొంది.

తాజా తీర్పును కీలకమైనదిగా ఆప్ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా అభివర్ణించారు.‘ సత్యమేవ జయతే. ఢిల్లీ గెలిచింది. ఇక్కడి అధికారులు స్థానికంగా ఎన్నికైన ప్రభుత్వం ద్వారా ప్రజలకు సేవలందించాలని, పాలనను స్తంభింపజేసేందుకు కేంద్రం నియమించిన , ప్రజలు ఎన్నుకోని వ్యక్తుల( ఎల్‌జి)ద్వారా కాదన్న కఠిన సందేశాన్ని తాజా తీర్పు పంపుతోంది’ అని ఆయన పేర్కొన్నారు. సుదీర్ఘ పోరాటం తర్వాత సుప్రీంకోర్టు తమ ప్రభుత్వానికి దాని హక్కును కట్టబెట్టిందని ఆప్ సీనియర్ నేత, మంత్రి అతిశీ వ్యాఖ్యానించారు.‘ సిఎం కేజ్రీవాల్ ల్లీ ప్రజలకోసం ఎనిమిదేళ్లు సుదీర్ఘన్యాయపోరాటం చేశారు. ఈ రోజు ప్రజలు గెలిచారు’ అని మరో మంత్రి సౌరభ్ భరద్వాజ్ ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News