Monday, December 23, 2024

ప్రజాస్వామ్యానిదే విజయం: మల్లిఖార్జున ఖర్గే

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో ప్రజాస్వామ్యానిదే విజయమని జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తెలిపారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ అనుకూలంగా రావడంతో ఖర్గే మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికలలో అధికారం, డబ్బు ప్రభావం పని చేయలేదన్నారు. బిజెపి దృష్టంతా కర్నాటక ఎన్నికల మీదే పెట్టిందన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి సిఎం అభ్యర్థిని అదిష్టానమే నిర్ణయిస్తుందని ఖర్గే స్పష్టం చేశారు. కర్నాటక ఎన్నికలోతోనే కాంగ్రెస్‌దే హవా కొనసాగుతుందని, ప్రభుత్వ ఏర్పాటులో కాంగ్రెస్ పార్టీ బిజీ బిజీగా ఉంది.

రేపు బెంగళూరు సిఎల్‌పి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో సిఎం అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం ఉంది. సిఎం రేసులో సిద్ధరామయ్య, డికె శివకుమారులు ఉన్నారు. శనివారం రాత్రి బస్వరాజ్ బొమ్మై రాజీనామా చేసే అవకాశం ఉంది. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలో కాంగ్రెస్ పార్టీ 96 సీట్లు గెలుచుకోగా 36 స్థానాలలో ఆధిక్యంలో ఉంది. బిజెపి 46 స్థానాలలో విజయం సాధించగా 21 స్థానాలలో ఆధిక్యంలో ఉంది. జెడిఎస్ 14 స్థానాలలో గెలుపొందగా ఏడు స్థానాలలో ఆధిక్యంలో ఉంది. ఇతరులు నాలుగు స్థానాలలో గెలుపొందారు.

Also Read: కర్నాటక ఫలితాలే తెలంగాణలోనూ రాబోతున్నాయి: రేవంత్ రెడ్డి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News