Friday, November 22, 2024

కెసిఆర్ వల్లే రాష్ట్రంలో జనరంజక పాలన

- Advertisement -
- Advertisement -
  • మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి

వేల్పూర్: ముఖ్యమంత్రి కెసిఆర్ జనరంజక పాలన, సంక్షేమ పథకాలు, బాల్కొండ నియోజక వర్గంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై వేల్పూర్ మండలం అంక్సాపూర్, బాల్కొండ మండలం జలాల్‌పూర్ గ్రామాల నుండి కాంగ్రెస్, బిజెపి పార్టీలకు చెందిన సుమారు 150 మంది రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సమక్షంలో బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి మంత్రి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మాట్లాడుతూ అంక్సాపూర్, జలాల్‌పూర్ గ్రామాల నుండి ఇంత పెద్ద ఎత్తున స్వచ్చంధంగా పార్టీలో చేరి కెసిఆర్‌కు, తనకు మద్దతు తెలిపేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయ పూర్వక ధన్యవాదాలు అని ఒక నుండి మీరు బిఆర్‌ఎస్ కుటుంబ సభ్యులని మీకు ఎల్లవేళలా అండగా ఉంటానని మంత్రి వారికి భరోసా కల్పించారు. బాల్కొండ నియోజక వర్గ ప్రజలే నా కుటుంబ సభ్యులుగా భావించి గత 9 ఏళ్లుగా వేల కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నాని అన్నారు. ఒక్క జలాల్‌పూర్‌లోనే కోటి రూపాయలు రోడ్లు వేసుకున్నామని అన్నారు.

నియోజక వర్గ స్థాయి కుల సంఘ భవనాలకు 100 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. నేడు కెసిఆర్ వల్లే తెలంగాణ రాష్ట్రంలో జనరంజక పాలన సాగుతోందని, కెసిఆర్‌కి తనకు ప్రజలు మద్దతుగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News