Monday, September 30, 2024

ముందు ‘హైడ్రా’ కార్యాలయాన్ని కూల్చండి: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాంగ్రెస్ ఇచ్చిన హామీలను గాలికొదిలేసిందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్ విమర్శించారు. తెలంగాణ భబన్ లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో చెరువులకు హద్దులు గుర్తించాలన్న స్సృహ 60 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ ఎందుకు రాలేదని ఆయన నిలదీశారు.  ఫుల్ ట్యాంక్ లెవల్(ఎఫ్ టిఎల్)  నిర్మాణాలకు అనుమతి ఇచ్చిన అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. అసలు ఈ ప్రభుత్వానికి ఏవైనా ప్రాధాన్యతలు ఉన్నాయా? అన్నారు. మూసీపై రూ. 1.50 లక్షల కోట్లు కేటాయిస్తారా? అని సీరియస్ అయ్యారు.  2400 కిలోమీటర్ల గంగా నదికే కేవలం రూ. 40 వేల కోట్లు కేటాయించారని గుర్తుచేశారు.

హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అస్సెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్(హైడ్రా) కార్యాలయం ఉన్నదే ఎఫ్ టిఎల్ లోనే అన్నారు. కూలిస్తే ముందు దాన్ని కూల్చాలన్నారు. జిహెచ్ఎంసి కార్యాలయం, సచివాలయం కూడా ఎఫ్ టిఎల్ పరిధిలోనే ఉన్నాయన్నారు. ఎవరి కమీషన్ల కోసం మూసీ సుందరీకరణ అని మండిపడ్డారు.

కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీల సంగతి ఏమిటని నిలదీశారు. ఇప్పటి వరకు రూ. 4 వేల ఆసరా పింఛన్లు ఇవ్వడం లేదు. ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వడం లేదు. ప్రజలు తిరగబడితే మంత్రులు గ్రామాల్లో తిరగగలరా? అని ప్రశ్నించారు. ఇదిలావుండగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తిపోతల పథకం (లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్) అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News