Wednesday, January 22, 2025

మల్కాపూర్‌ చెరువులోని ఐదంతస్థుల భవనం డిటోనేటర్లతో కూల్చివేత

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/కొండాపూర్: మల్కాపూర్‌లోని పెద్ద చెరువులో అక్రమ కట్టడాలను క్షణాల్లో డిటోనేటర్‌ల సహాయంతో నేలమట్టం చేశారు. గురువారం సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండల పరిధిలోని మల్కాపూర్ పెద్ద చెరువులో అక్రమం గా నిర్మించిన ఎఫ్‌టిఎల్ పరిధిలో ఉన్న ఐదు అంతస్థుల భవనాన్నీ డిటోనేటర్ల సహాయంతో కూల్చివేశారు. మల్కాపూర్ చెరువులో సర్వే నెం బర్ 95లో 250 గజాల స్థలంలో ఎఫ్‌టిఎల్ ప రిధిలో 5 అంతస్థుల భవనాన్నీ అక్రమంగా ని ర్మించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బి ల్డింగ్‌లోకి నీరు చేరింది. మల్కాపూర్ చెరువు ఎఫ్‌టిఎల్ పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని మల్కాపూర్ గ్రామస్థులు కొండాపూర్ తహశీల్దార్ అనితకు ఫిర్యాదు చేశా రు. గ్రామస్థుల ఫిర్యాదుతో స్పందించిన నీటిపారుదల శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు రెండు రోజుల క్రితం సర్వే చేయగా ఎఫ్‌టిఎల్ పరిధి లో ఉందని తేలడంతో తహశీల్దార్ అనిత ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు నోటీసులు అందజేశారు. గురువారం ఉదయం రెవెన్యూ, నీటిపారుదల శాఖ పోలీసు యంత్రాంగం గ్రామానికి చేరుకున్నారు.

చెరువులోకి వాహనాలు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో బ్లాస్టింగ్ నిర్వహించి బిల్డింగ్‌ను నేలమట్టం చేశారు. బాంబు బ్లాస్టింగ్ జరపడంతో రాయి ఎగిరి పడడంతో హోంగార్డు గో పాల్, కార్మికునికి గాయాలయ్యాయి. వెంటనే చికిత్స కోసం వారిని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు అధికారులు తరలించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ అనిత మాట్లాడుతూ మల్కాపూర్ పెద్ద చెరువులో సర్వేనెంబర్ 95లో 3 ఎకరాల ఒక గుంట భూమిని కొనుగోలు చేసి 250 గజాల స్థలంలో అక్రమంగా బిల్డింగ్‌ను నిర్మించారని చెప్పారు. గ్రామస్థుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు పోలీసుల సహాయంతో డిటోనేటర్లను అమర్చి బ్లాస్టింగ్ చేసి క్షణాల్లో ఐదు అంతస్థుల భవనాన్నీ నేలమట్టం చేశారు. బాధితుడు నర్సింలు మాట్లాడుతూ మల్కాపూర్‌లో చెరువులో 3ఎకరాల భూమి కొనుగోలు చేశామని, తనకు భూమి అమ్మినప్పుడు పట్టాభూమి అని చెప్పారన్నారు. బిల్డింగ్ నిర్మాణానికి అనుమతులు తీసుకునేటప్పుడు అధికారులు ఎఫ్‌టిఎల్ పరిధిలో ఉందని చెప్పలేదని అన్నారు. గ్రామ పంచాయితీ రెవెన్యూ అధికారుల అనుమతులతోనే బిల్డింగ్‌ను నిర్మించామన్నారు. 12ఏళ్ల తర్వాత బిల్డింగ్‌ను కూల్చడం దారుణమని, కోట్ల రుపాయల నష్టం జరిగిందని వాపోయా డు. ఈ కార్యక్రమంలో నీటి పారుదల శాఖ డిఇ బాలగణేష్, ఎఇ చక్రవర్తి, డిప్యూటీ తహశీల్దార్ ప్రదీప్‌లున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News