న్యూఢిల్లీ : ఉత్తర ప్రదేశ్ లోని నోయిడాలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన 40 అంతస్తుల భారీ జంట భవనాలను కూల్చి వేయాలని సుప్రీం కోర్టు మంగళవారం ఆదేశించింది. రియల్ ఎస్టేట్ కంపెనీ సూపర్‌టెక్ నోయిడాలో రెండు 40 అంతస్తుల నిర్మాణాలను చేపట్టింది. అయితే కోయిడా అధికారులు, బిల్డర్లు, కుమ్మక్కై ఆ బిల్డింగులను నిర్మించినట్టు కోర్టు చెప్పింది. నోయిడా లోని ఎమరాల్డ్ కోర్టులో సూపర్‌టెక్ కంపెనీ ఆ భవనాలను నిర్మించింది. వాటిలో వెయ్యి ప్లాట్లు ఉన్నాయి. అవన్నీ నిబంధనలను అతిక్రమించి నిర్మించినట్టు సుప్రీం కోర్టు వెల్లడించింది. మూడు నెలల్లోగా ఆ రెండు బిల్డింగ్‌లను సూపర్‌టెక్ కంపెనీయే తన స్వంత ఖర్చుతో నేలమట్టం చేయాలని సుప్రీం మంగళవారం తన తీర్పులో ఆదేశించింది. గతంలో ఈ కేసులో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు సమర్ధించింది. ఆ టవర్స్‌లో ప్లాట్లు కొన్న ప్రతి ఒక్కరికి ఆ డబ్బును రెండు నెలల్లోగా చెల్లించాలని ఆదేశించింది. ఏడాదికి 12 శాతం వడ్డీతో ఆ మొత్తాన్ని ఇవ్వాలని కోర్టు పేర్కొంది. రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్‌కు కూడా రెండు కోట్లు చెల్లించాలని బిల్డర్లకు కోర్టు ఆదేశించింది.
ఆ 40 అంతస్తుల టవర్లను కూల్చేయండి: సుప్రీం కోర్టు ఆదేశం
- Advertisement -
- Advertisement -
- Advertisement -