Saturday, December 28, 2024

యువతిని చితకబాదిన యువకుడి ఇల్లు బుల్‌డోజర్‌తో కూల్చివేత..

- Advertisement -
- Advertisement -

భోపాల్ : ఉత్తరప్రదేశ్ మాదిరిగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా సంఘవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారి ఇళ్లను కూల్చివేస్తోంది. రెండు రోజుల క్రితం తనను పెండ్లి చేసుకోవాలంటూ కోరిన ఓ యువతిని కిందపడేసి చితకబాదిన యువకుడి వీడియోపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. నిందితుడి ఇంటిని బుల్‌డోజర్లతో అధికారులు కూల్చివేశారు.

రేవా జిల్లా దేరా గ్రామానికి చెందిన పంకజ్ త్రిపాఠీ అనే 19 ఏళ్ల యువకుడు తనను పెళ్లి చేసుకోవాలని అడిగిన యువతిని చితక బాదాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిందితుడి ఇల్లును అక్రమంగా నిర్మించారంటూ బుల్‌డోజర్‌తో కూల్చివేశారు. మీర్జాపూర్‌లో శనివారం రాత్రి పంకజ్ త్రిపాఠీని అరెస్టు చేశారు. నిందితుడు వృత్తిరీత్యా డ్రైవర్ అయినందున ఆయనడ్రైవింగ్ లైసెన్సును కూడా రద్దు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News