Monday, December 23, 2024

చార్మినార్ సర్కిల్లో శిథిల భవనాల కూల్చివేత

- Advertisement -
- Advertisement -

చార్మినార్ : జీహెచ్‌ఎంసి చార్మినార్ సర్కిల్ పరిధిలో శిథిలావస్థకు చేరుకున్న భవనాలను మంగళవారం అధికారులు నేలమట్టం చేశారు. ఆ సర్కిల్ ఎసిపి ఖాదర్, సెక్షన్ ఆఫీసర్ నరేష్‌ల ఆధ్వర్యంలో దూద్‌బౌలి, హిమ్మత్‌పురా, ఖిల్వత్ తదితర ప్రాంతాలలో ఇప్పటికే గుర్తించి నోటీసులు జారీ చేసిన భవనాలను తగిన పోలీసు బందోబస్తు మధ్య పొక్లెయినర్ సహాయంతో కూల్చివేశారు. ఆ తరువాత రోడ్డు విస్తరణ పనులను పర్యవేక్షించారు.

ఇప్పటికే తమ ఆస్థులకు నష్టపరిహారం చెక్కులను తీసుక్ను భవన యజమానుల ఇళ్ళను నేలమట్టం చేశారు. ఈ సందర్భంగా ఎసిపి ఖాదర్ మాట్లాడుతూ వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా పురాతన ఇళ్ళను, కూలడానికి సిద్ధంగా ఉన్న శిథిల భవనాలను ఖాళీ చేయాలని కోరారు. రోడ్డు విస్తరణకు భవన యజమానులు సహకరించాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News