Tuesday, March 4, 2025

రాయదుర్గం మల్కం చెరువు వద్ద ఆక్రమ ఇళ్లు కూల్చివేత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: రాయదుర్గం మల్కం చెరువు వద్ద ఆక్రమణలను శేరిలింగంపల్లి రెవెన్యూ సిబ్బంది కూల్చివేస్తున్నారు. ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించిన భవనాలను సోమవారం ఉదయం పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేస్తున్నారు అధికారులు. ఎకరా భూమిలో ఆక్రమణలు ఉన్నట్లు గుర్తించిన అధికారులు వాటిని తొలగిస్తున్నారు.

ఇంట్లో ఉన్న వారిని బయటికి పంపించి ఇంటిని కూల్చేస్తున్నారు.అయితే, తమకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా, నోటిసులు కూడా ఇవ్వకుండా 40 సంవత్సరాలుగా పైగా ఉంటున్న తమ ఇంటిని కూల్చేస్తున్నారు అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News