Sunday, December 22, 2024

బాలికపై అమానుషం.. బుల్‌డోజర్లతో నిందితుల ఇళ్లు కూల్చివేత

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : పన్నెండేళ్ల బాలికపై అత్యంత కిరాతకంగా అత్యాచారం చేయడమే గాక, ఆమె మర్మాంగాల్లోకి ఇనుప ఊచను జొప్పించిన ఇద్దరు నిందితుల ఇళ్లను మధ్యప్రదేశ్ ప్రభుత్వం బుల్‌డోజర్లతో కూల్చి వేసింది. గురువారం ఈ సంఘటన జరిగింది. నిందితులు రవీంద్ర చౌదరి, అతుల్ బధౌలియా సాత్నా జిల్లా మైహర్ పట్టణంలో ఓ ప్రముఖ ఆలయ ట్రస్టులో దినసరివేతన కార్మికులుగా పనిచేస్తున్నారు. ఈ దారుణం వెలుగు లోకి రావడంతో వారిని ఉద్యోగాల నుంచి తొలగించి అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్ లోని విదిశ జిల్లా ఉదయ్‌పూర్‌లో ఉన్న రవీంద్ర ఇంటిని, మలియాన్ టోల న్యూబస్తీ లోని అతుల్ ఇంటిని శనివారం బుల్‌డోజర్లతో భారీ పోలీస్ బందోబస్తు మధ్య అధికారులు కూల్చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షకు పంపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News