Tuesday, January 21, 2025

గండిపేటలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలో అక్రమ నిర్మాణాల పై రెవెన్యూ అధికారులు కొరడా ఝులిపించారు. కబ్జా కోరులు కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టారు. రెవెన్యూ అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చి వేశారు. హిమాయత్ సాగర్ సర్వే నెంబర్ 37 లో గల 1000 గజాల స్థలంతో పాటు కిస్మత్ పూర్ సర్వే నెంబర్ 132 లో వెలసిన అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు నేలమట్టం చేశారు. సోమవారం తెల్లవారుజామున జెసిబిల సహాయంతో నిర్మాణాలను రెవెన్యూ సిబ్బంది తొలగించారు.  అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేశామని గండిపేట తహసీల్దారు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News