Sunday, December 22, 2024

కావూరి హిల్స్ లో అక్రమ నిర్మాణాలు కూల్చివేత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మాదాపూర్‌లోని కావూరి హిల్స్ లో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చేశారు. కావూరి హిల్స్ లో పార్కు స్థలంలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చేశారు. గతంలో కావూరి హిల్స్ పార్కు స్థలంలో స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేశారు. పార్కులో స్పోర్ట్స్ అకాడమీపై కావూరి హిల్స్ అసోసియేషన్ ఫిర్యాదు చేసింది. కావూరి హిల్స్ అసోసియేషన్ ఫిర్యాదుతో అక్రమ షెడ్లను కూల్చివేశారు. అక్రమ నిర్మాణాలు తొలగించి కావూరి హిల్స్ పార్కు పేరిట బోర్డు ఏర్పాటు చేసుకున్నారు. పార్కు స్థలాన్ని 25 ఏళ్లు లీజుకు తీసుకున్నామని స్పోర్ట్స్ అకాడమీ నిర్వాహకులు తెలిపారు. గడువు తీరకముందే అన్యాయంగా నిర్మాణాలు తొలగించారని ఆరోపణలు చేశారు. కావురి హిల్స్‌లోని అక్రమ నిర్మాణాల కూల్చివేతపై హైడ్రా కమిషనర్ స్పందించారు. కోర్టు ఆదేశాలతోనే కావూరి హిల్స్‌లోని అకాడమీని కూల్చివేశామని హైడ్రా అధికారి రంగనాథ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News