Wednesday, October 30, 2024

ఆంక్షల వెనుక పకడ్బందీ వ్యూహం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ సిటీబ్యూరో: రాష్ట్రంలో రాజకీయ బాంబులు ఈ వారంలో పేలనున్నాయా..? ప్రధాన విపక్షపార్టీలో భూకంపం రా నుందా…? గత ప్రభుత్వంలోని కీలక నేతలను అరెస్టు చేయనున్నారా…? మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సియోల్‌లో చేసిన సంచలన వ్యాఖ్యలు నిజం కానున్నాయా..? ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పదేపదే చెప్పినట్లుగా జరగనుందా…? అన్న ప్రశ్నలకు రాజధానిలో నెలకొంటున్న పరిస్థితులను చూస్తే అవుననే సమాధానాలు వస్తున్నాయి. రాజధానిలో ఏం జరగబోతుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. గతంలో ఎన్నడూ లేని విధం గా దీపావళి ముంగిట నెలరోజుల పాటు నగరంలో నిషేధాజ్ఞలు విధించడం సర్వత్రా చర్చనీయాంశమయ్యింది. పండగ పూట జంట నగరాల్లో పోలీసులు ఆంక్షలు విధించడం రాజకీయవర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

నగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలతో బాధితుల ఆగ్రహజ్వాలలు ఉవ్వెత్తున ఎగిసినా… పదిహేనురోజుల క్రి తం వరసగా చోటుచేసుకున్న ప్రార్థనామందిరాల ధ్వంసం ఘటనల తో నగరం అట్టుడికినా… బెటాలియన్ కానిస్టేబుళ్ల నిరసనలు నగరా న్ని చుట్టుముట్టినా… ఎలాంటి ఆంక్షలు విధించని సర్కార్…. గతం లో ఎన్నడూ లేనివిధంగా ఏకంగా నెలరోజుల పాటు…అదీ దీపావళీ పండగ వేళ ఈ ఆంక్షలు విధించడం వెనక రేవంత్‌రెడ్డి సర్కార్ పక్కా పకడ్బందీ వ్యూహరచనతో ఉన్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో కీ లకంగా వ్యవహరించిన ఇద్దరు బడా నేతలను అరెస్టుచేసేందుకు ప్ర భుత్వం రంగం సిద్ధం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలోనే ముందుస్తుగా నగరంలో నిషేధాజ్ఞలు విధించినట్లు ప్రచారం సాగుతోంది. వాస్తవానికి రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రత్యర్థిపార్టీ(గత ప్రభుత్వం)లోని బ డానేతలను అరెస్టు చేసేందుకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు గత పదినెలలు గా జరుగుతున్న పరిణామాలను చూస్తే తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాం లో చేపట్టిన పథకాల్లో జరిగిన అవినీతితో పాటు ఫోన్‌ట్యాపింగ్.

ధరణీ,కాళేశ్వరం తదితర వాటిపై జరిగిన అవకతవకలపై దృష్టి సారించి విచారణలు చే యిస్తున్న విషయమూ విదితమే. కొన్ని విచారణ దిశలో ఉండగా, మరికొన్ని విచారణలు పూర్తయ్యాయి. అయితే, ప్రత్యర్థులు తప్పించుకోవడానికి ఏమా త్రం అవకాశం ఇవ్వకుండా పకడ్బందీగా వ్యవహరించాలన్న ఉద్దేశంతో ఇ న్నాళ్లు ఎదురుచూసిన రేవంత్‌రెడ్డి సర్కార్ ఇక అన్ని ఆధారాలు లభ్యం కావడంతో అరెస్టులకు రంగం సిద్ధం చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈక్రమంలోనే మూసీ పునరుజ్జీవం కోసం సియోల్‌కు అధ్యయనం కోసం వెళ్లిన సందర్భంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. త్వరలోనే బడానేతల అరెస్టులు వరసగా జరగనున్నానని…. రాజకీయ బాంబులు పేలనున్నాయని పేర్కొనడం రాష్ట్రంలో తీవ్ర అలజడిని రేపిన విషయం తెలిసిందే. అరెస్టుల నేపథ్యంలో పరిస్థితిని అంచనా వేసేందు కు ప్రభుత్వం ముందుగా మంత్రి శ్రీనివాస్‌రెడ్డితో లీకులు ఇప్పించినట్లుగా రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

ఇందులో భాగంగానే నగరంలో నిషేధాజ్ఞలు విధించి, పోలీసు బలగాలను నగరంలో భారీగా మోహరిస్తున్నట్లు తె లిసింది. ఈ వారంలో ఇద్దరు బడానేతలను అరెస్టు చేసే అవకాశం ఉందని.. ఈ సందర్బంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అదనపు బలగాలను కూడా నగరానికి రప్పిస్తున్నట్లు విశ్వసనీయ సమాచా రం. ఇదిలావుండగా, మంత్రి శ్రీనివాస్‌రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో రేవంత్ స ర్కార్ తీసుకోబోయే చర్యలపై ప్రత్యర్థి పార్టీ నేతలు కూడా వ్యూహాత్మకంగా అ డుగులు వేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ అరెస్టులు చేస్తే ఏవిధంగా ప్రతిఘటించాలన్న దానిపై ప్రత్యర్థిపార్టీ ముఖ్యనేతల సమావేశంలో చర్చించినట్లు తె లిసింది. రాజధానిలో చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలు రాష్ట్రంలో స ర్వ త్రాచర్చనీయాంశమయ్యాయి.ఏం జరగనుందని నిశితంగాపరిశీలిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News