Wednesday, January 22, 2025

మాదాపూర్‌, దుండిగల్‌లో భవనాలు, విల్లాలు కూల్చివేత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జిహెచ్‌ఎంసి పరిధిలో ఆక్రమణల కూల్చివేతపై హైడ్రా దూకుడు ప్రదర్శిస్తోంది. మాదాపూర్‌లోని సున్నం చెరువులో ఎఫ్‌టిఎల్ పరిధిలో ఉన్న అపార్ట్‌మెంట్‌, షెడ్స్ ను కూల్చివేస్తున్నారు. సున్నం చెరువు మొత్తం విస్తీర్ణం 26 ఎకరాలు కాగా చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ 15 ఎకరాల 20 గుంటలుగా ఉంది, కబ్జా చేసి భారీ షెడ్స్, భారీ భవనాలు నిర్మించారు. ఆక్రమంగా నిర్మించిన భవనాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. సున్నం చెరువులోని ఎఫ్ టిఎల్ పరిధిలో సర్వే నంబర్లు 12,13,14,16 ఉన్నాయని అదికారులు తెలిపారు.

దుండిగల్‌లోని కత్వా చెరువులోని ఎఫ్‌టిఎల్ పరిధిలో ఉన్న శ్రీలక్ష్మీ శ్రీనివాస్ కన్‌స్ట్రక్షన్ విల్లాలను కూల్చివేస్తున్నారు. దీంతో కూల్చివేతల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా ఝుళిపిస్తోంది. హెచ్‌ఎంటి కాలనీ, వాణినగర్‌లో ఆక్రమణలను కూల్చేస్తున్నారు. రెవెన్యూ, మున్సిపల్ అధికారులు, పోలీసుల బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలను కూల్చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News