Tuesday, February 4, 2025

పేదల ఇళ్లు కూల్చడం సరికాదు: దానం నాగేందర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అధికారుల విషయంలో, అలాగే హైడ్రా విషయంలో కూడా వెనక్కి తగ్గేది లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. ఈ సందర్భంగా హైడ్రా కూల్చివేతలపై దానం మాట్లాడారు. పేదల ఇళ్లు కూల్చుతామంటే ఊరుకోమని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్లమ్ ల జోలికి వెళ్లొద్దని ముందే చెప్పానని, మూసీ నిర్వాసితులకు కౌన్సిలింగ్ ఇవ్వాల్సిందని సలహా ఇచ్చారు.  తన పై 173 కేసులున్నాయని, పోతే జైలుకు పోతానని పేర్కొన్నారు. తన ఇంట్లో వైఎస్ఆర్, కెసిఆర్ ఫొటోలున్నాయని, ఉంటే తప్పేంటని నాగేందర్ ప్రశ్నించారు. నాయకుల విషయంలో ఎవరి అభిమానం వాళ్లదని దానం నాగేందర్ స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News