Sunday, December 22, 2024

కృష్ణజన్మభూమి సమీపంలో కూల్చివేతలకు “సుప్రీం” తాత్కాలిక బ్రేక్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ లోని మథురలో గల కృష్ణజన్మభూమి సమీపంలో రైల్వే అధికారులు చేపట్టిన అక్రమ కట్టడాల కూల్చివేతలపై సుప్రీం కోర్టు బుధవారం కీలక ఆదేశాలు వెలువరించింది. పది రోజుల పాటు ఎలాంటి కూల్చివేతలు చేపట్టకుండా రైల్వే శాఖను ఆదేశించింది. దీనిపై కేంద్రానికి నోటీసులు జారీ చేసిన సర్వోన్నత న్యాయస్థానం తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

వందేభారత్ లాంటి అధునాతన రైల్వేల రాకపోకలకు వీలుగా మథుర నుంచి బృందావన్ వరకు చేపట్టిన 21 కిమీ ల స్ట్రెచ్ నిర్మాణంలో భాగంగా ఆగస్టు 9 న కృష్ణజన్మభూమి సమీపంలో ఉన్న అక్రమ కట్టడాల తొలగింపు ప్రక్రియ చేపట్టారు. ఇందులో భాగంగా కృష్ణజన్మభూమి వెనుకవైపు ఉన్న నయీ బస్తీలో ఇప్పటివరకు135 ఇళ్లను కూల్చివేశారు. అయితే ఇదంతా కుట్రపూరితంగా చేస్తున్నారని ఆరోపించిన బస్తీవాసులు కూల్చివేతలకు వ్యతిరేకంగా స్థానిక కోర్టులో పిటిషన్ వేశారు.

అయితే యూపీలో న్యాయవాదుల ఆందోళన కారణంగా ఈ పిటిషన్‌పై విచారణ జరగలేదు. దీంతో వారు సుప్రీం కోర్టును ఆశ్రయించగా, పదిరోజుల పాటు కూల్చివేతలు చేపట్టరాదని కోర్టు ఆదేశాలిచ్చింది. ఇదిలా ఉండగా కృష్ణజన్మభూమి షాహీ ఈద్గా మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వే నిర్వహించాలని కోరుతూ సుప్రీం కోర్టులో శ్రీకృష్ణ జన్మభూమి ముక్తి నిర్మాణ్ ట్రస్ట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై సర్వోన్నత న్యాయస్థానం త్వరలో విచారణ జరపనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News