Thursday, January 23, 2025

మణిపూర్‌లో రాక్షస పాలనను గద్దెదించాలి

- Advertisement -
- Advertisement -

అచ్చంపేట : మణిపూర్ రాష్ట్రంలో మైతిలు కుకీలపై చేస్తున్న అరాచకాలను, రాక్షస పాలనను తక్షణమే గద్దె దించే వరకు క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీలు కొనసాగిస్తామని క్రైస్తవ సంఘాల ప్రతినిధులు తెలిపారు. సోమవారం అచ్చంపేట నియోజకవర్గంలోని క్రైస్తవ, ముస్లింల కమిటీల ఆధ్వర్యంలో మణిపూర్‌లో జరుగుతున్న విచక్షణారహిత దాడులకు నిరసనగా పలు సంఘాల ఆధ్వర్యంలో బస్టాండ్ సమీపం నుంచి ప్రధాన రహదారుల గుండా క్రైస్తవులపై దాడులను ఖండిస్తున్నామని నినాదాలు చేసుకుంటూ అంబేద్కర్ చౌరస్తా వరకు శాంతియుత ర్యాలీ చేపట్టారు.

అనంతరం అంబేద్కర్ చౌరస్తా వద్ద క్రైస్తవ, ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ మణిపూర్ రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి రా వడం ద్వారా అక్కడ ఉన్న మైతిలు మతోన్మాద శక్తులు కొండల్లో నివసిస్తున్న కూకీల వర్గంపై దాడులు నిర్వహిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్న కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఆరోపించారు.

అదే విధంగా క్రైస్తవ మహిళలపై విచక్షణా రహితంగా కాల్పులు జరుపుతూ, వారిని వివస్త్రతగా ఊరేగించి సా మూహిక అత్యాచారాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం చూసి చూడనట్టు వ్యవహరిస్తుందని కిస్ట్రియన్ మత పెద్దలు ఆరోపించారు. మణిపూర్‌లో చర్చిలపై దాడులను ఖండిస్తున్నామని తెలిపారు. అదే విధంగా ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే గువ్వల బా లరాజు హాజరై వాళ్లకు సంఘీభావం, మద్ధతు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మణిపూర్‌లో అసాంఘిక శక్తులు పెరిగిపోతున్న కేంద్ర ప్రభుత్వం చూసి చూడనట్టు వ్యవహరిస్తుందని, దేశంలో డబుల్ ఇంజన్ సర్కార్‌తో ఈ రకమైన పరిపాలన కొనసాగిస్తారని ఆరోపించారు. మణిపూర్‌లో మైతీల దౌర్జన్యాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మై నార్టీ ఇమాములు, మస్జీద్ కమిటీ సదర్ సిద్ధిఖ్, కిస్ట్రియన్ నాయకులు ఫెర్రి రాయి, వివిధ చర్చిల పాస్టర్లు సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News