Thursday, January 23, 2025

పదో తరగతి విద్యార్థినిపై వాలంటీర్ అత్యాచారం…

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆధార్ కార్డు కావాలని అడిగి పదో తరగతి బాలికపై వాలంటీర్ అత్యాచారం చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లా దెందెలూరు మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నీలాపు శివకుమార్ అనే వాలంటీర్ గత కొన్ని రోజుల నుంచి పదో తరగతి బాలికపై కన్నేశాడు. ఆమెను ప్రతి రోజు వేధించేవాడు. బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో ఇంటికెళ్లి ఆధార్ కార్డు కావాలని అడిగాడు. వెంటనే ఇంట్లోకి వెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ విషయం బయటకు చెబెతే చంపేస్తానని బెదిరించాడు.

అలా పలుమార్లు ఆమెపై అత్యాచారం చేశాడు. పాఠశాలకు సెలవులు రావడంతో ఆమె తన పెద్దమ్మ ఇంటికి వెళ్లింది. కడుపులో నొప్పిగా ఉందని పెద్దమ్మకు చెప్పడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాలిక గర్భవతి అని తెలియడంతో వాలంటీర్‌ను నిలదీశారు. రూ.10 వేల రూపాయలు ఇస్తామని, కడుపు తీయించుకోమ్మని సలహా ఇవ్వడంతో గొడవ జరిగింది. పెద్ద మనషుల సమక్షంలో పెళ్లి చేసుకోవాలని తీర్మానం చేయడంతో ఒప్పుకున్నాడు. పెళ్లికి ఒక రోజు ముందు స్థానిక రాజకీయ నాయకుల అండతో గ్రామం నుంచి వాలంటీర్ పారిపోయాడు. దిశ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి బాలిక తల్లిదండ్రులు వెళ్తే పట్టించుకోలేదు. అక్కడి నుంచి దెందలూరు పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు.

అక్కడ కూడా కేసు తాత్సారం చేశారు. బాదితురాలు 112కు పోన్ చేసి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని వెల్లడించారు. నిందితుడిని బాలిక కుటుంబ సభ్యులు పట్టుకొని రావాలని పోలీసులు ఉచిత సలహా ఇచ్చినట్టు సమాచారం. దీంతో పోలీసులు వ్యవహారంపై సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. స్థానిక వైసిపి నాయకుడి అండతోనే పోలీసులు కేసును నీరుగారుస్తున్నారని గ్రామస్థులు ఆరోపణలు చేస్తున్నారు. వైసిపి నాయకుల అండతోనే వాలంటీర్లు గ్రామాల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. గ్రామాల్లో వాలంటీర్లు చెప్పిందే వేదంగా మారిందని గ్రామస్తులు వాపోతున్నారు. గ్రామంలో ఉన్న మహిళలలో వాలంటీర్లు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని గ్రామస్థులు ఆరోపణలు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News