Friday, October 18, 2024

గ్రేటర్‌లో డెంగ్యూ కేసులు అధికం

- Advertisement -
- Advertisement -

Dengue cases are high in Greater Hyderabad

రెండు నెల వ్యవధిలో 960 దాటిన రోగులు
కరోనా కంటే డేంజర్‌గా మారిన సీజనల్ వ్యాధులు
దోమల దండయాత్రతో జ్వరాలతో ఆసుపత్రుల బాట
రోగులతో రద్దీగా మారిన ప్రభుత్వ దవఖానలు
ప్రజలు దోమల పట్ల అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు

హైదరాబాద్: గ్రేటర్ నగరంలో డెంగ్యూ కేసులు రోజు రోజుకు పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురైతున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల్లో 40శాతం మహానగరం నుంచే బయటపడుతున్నట్లు జిల్లా వైద్యాధికారులు పేర్కొంటున్నారు. రెండు నెలల వ్యవధిలో 960 కేసులు నమోదైనట్లు, వివిధ ఆసుపత్రుల్లో రోగులు వైద్య సేవలు పొందుతున్నట్లు వెల్లడిస్తున్నారు. బస్తీదవఖానలు, ప్రాథమిక ఆరోగ్య సెంటర్లు రద్దీ పెరగడంతో తప్పనిసరి పరిస్దితుల్లో కార్పొరేట్ ఆసుపత్రులను ఆశ్రయించే దుస్దితి వచ్చిందని నగర ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగరంలో మురుగునీటి వ్యవస్ద సక్రమంగా లేకపోవడంతో రోడ్లపై వర్షపు నీరు నిల్వ ఉండటంతో ఎడిస్ ఈజిప్టి దోమలు రెచ్చిపోతూ రాత్రి పగలు లేకుండా ప్రజలను కాటు వేస్తున్నారు. దీంతో ప్రజలు మలేరియా, టైపాయిడ్ వంటి జ్వరాలతో బాధపడుతున్నారు. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో ప్రతి వంద ఇళ్లలో 21 ఇళ్లలో దోమల దండయాత్ర చేస్తున్నాయని బయటపడింది.

గత నెల రోజు నుంచి కురుస్తున్న వర్షాలకు వరద నీరు మురికి గుంతలో చేరడంతో వ్యాధులు ముసురుకొస్తున్నాయని స్దానిక వైద్యులు చెబుతున్నారు. ఇంట్లో ఒకరికి డెంగ్యూ సోకిన కుటుంబ సభ్యులకు వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు. ఇళ్లలో దోమలు పెరగకుండా ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రధానంగా పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించాలని, పగటి పూట కూడా వీరిని కుట్టకుండా శరీరమంతా కప్పి ఉంటే దుస్తులు ధరించాలి. ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన ఆహార పదార్దాలు తీసుకోవద్దని, వేడి నీళ్లు తాగాలని టిఫిన్ సెంటర్ల వద్ద దొరికే పుడ్ తీసుకోవద్దని చెబుతున్నారు. ఇంటి పరసరాల్లో చెత్త కుండీలు, టైర్లు, సీసాలు, ప్లాస్టిక్ గ్లాసులు లేకుండా చూడాలని, మురికి నీరు ఉంటే మున్సిఫల్ సిబ్బంది ద్వారా తొలగించాలన్నారు. సీజనల్ వ్యాధులు దృష్టిలో పెట్టుకుని వైద్యశాఖ తగిన ఏర్పాట్లు చేసినట్లు ముందుగానే 15 ప్లేట్‌లెట్ సెపరేషన్ మిషన్లు అందుబాటులో ఉంచారు.

డెంగ్యూ లక్షణాలు ఉండటంతో చాలామంది ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తే టెస్టులు సక్రమంగా నిర్వహించకుండా నిర్దారణ చేస్తూ ఆసుపత్రిలో చేరేలా భయపడుతూ దోచుకునే పనిలో పడ్డాయి. ప్రజలు ప్రభుత్వం ఆసుపత్రుల్లోనే చికిత్స చేయించుకోవాలని సూచిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ అధికారులు వ్యాధులు విస్తరించకముందే ఫాగింగ్ చేసి నివారణ చర్యలు చేపట్టాలని వైద్యాధికారులు కోరుతున్నారు. గత నాలుగేళ్లుగా డెంగీ కేసులు పరిశీలిస్తే 2017 సంవత్సరంలో 410మందికి, 2018లో 263 మందికి సోకగా, 2019లో 1406మంది, 2020లో 100లోపు నమోదుకాగా ఈఏడాది వెయ్యికు చేరులో కేసులు నమోదైనట్లు వైద్యశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నారు. ప్రజలు ఉస్మానియా, గాంధీ, టిమ్స్ ఆసుపత్రుల్లో డెంగు నిర్దారణ కోసం ఎలిజా పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.

సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి:  వైద్యులు

వాతావరణ మార్పులతో డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు విజృంభించే అవకాశముందని, మరో రెండు నెలల పాటు ప్రజలు వైద్యులు సూచించిన జాగ్రత్తలు పాటించాలని, ముఖ్యంగా దోమలు వ్యాప్తిచెందకుండా చూసి, పిల్లల బయట తిరగకుండా చూడాలని పేర్కొంటున్నారు. ప్రజలు వ్యాధుల పట్ల ఎక్కువ భయపడవద్దని, ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లకుండా బస్తీదవఖానలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో చికిత్స పొందాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News