Thursday, January 23, 2025

డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి

- Advertisement -
- Advertisement -
ప్రభుత్వం వెంటనే స్పందించాలి

మనతెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్‌లో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయని, చిన్నారుల నుంచి వయోవృద్ధుల దాకా దీని బారిన పడుతున్నారని టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రస్తుతం ఆస్పత్రులకు జనం క్యూ కడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని ఆయన సూచించారు.

ఇటీవల డెంగ్యూతో ఖమ్మం జిల్లాలో ఓ ఇంటర్ విద్యార్థిని మృతి చెందింది. ఈ నేపథ్యంలోనే టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి శనివారం సోషల్ మీడియా వేదికగా స్పందించారు. డెంగ్యూ బారిన పడిన పేద, మధ్యతరగతి ప్రజలకు వైద్య ఖర్చు మోయలేని భారంగా మారిందన్నారు. డెంగ్యూ బారిన పడిన వారికి మెరుగైన, ఉచిత వైద్య సేవలు అందించడంతో పాటు వ్యాధి నివారణకు యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News