Monday, December 23, 2024

10 జిల్లాల్లో డెంగ్యూ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా డెంగీ, మలేరియా, చికెన్ గున్యా, హెచ్1ఎన్1 వైరస్ ప్రబలుతున్నాయని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ రవీంద్ర నా యక్ అన్నారు. శనివారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది ఇప్పటి వరకు 4,600 డెంగీ కేసులు నమోదయ్యాయన్నారు. అలాగే 10 జిల్లా ల్లో డెంగీ కే సులు ప్రభావం ఎక్కువగా ఉందని తెలిపా రు. కేవలం ఒక్క హైదరాబాద్ జిల్లాలో 1,697 కేసులో నమోదు కాగా సం గారెడ్డి, ఖమ్మం జిల్లాల్లోనూ ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదయ్యాయని పేర్కొన్నా రు. ఈ క్రమంలో డెంగీ కేసుల గురించి ఆందోళనకు గు రికావద్దని, జిల్లాల్లోని అధికారులతో సమన్వయం చేసుకుని త గిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇంటింటి సర్వే తో పాటు పరీక్షలు చేసి చికిత్స అందిస్తున్నామని తె లిపారు. ప్రపంచ దేశాల్లో చాపకింద నీరులా విస్తరిస్తు న్నా తెలంగాణలో ఒక్క మంకీ పాక్స్
కేసు కూడా నమోదు కాలేదని తెలిపారు.

మంకీ పాక్స్ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందన్న డబ్ల్యూహెచ్‌వో అలర్ట్‌గా ఉన్నామన్నారు. హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో మంకీ పాక్స్ కోసం ప్రత్యేకంగా ఐసోలేషన్ బెడ్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. వాతావరణం మార్పు వల్ల దోమలతో డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు వ్యాపిస్తున్నాయన్నారు. వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పటివరకు తెలంగాణలో డెంగ్యూ వ్యాధి కేసులు దాదాపు 5వేల వరకు ఉన్నాయని, అందులో కొన్ని హై రిస్క్ కేసులను గుర్తించామని తెలిపారు. అయితే, డెంగ్యూ వల్ల ఒక్క డెత్ కూడా నమోదు కాలేదని వెల్లడించారు. ప్రతి సంవత్సరం వచ్చే వ్యాధులు కాబట్టి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతోందన్నారు. రాష్టంలో ఇంటి ఇంటికి సర్వే చేస్తున్నామని, గ్రామాలు, మున్సిపాలిటీల్లో ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 42 ల్యాబ్స్ ఉన్నాయని, మొత్తం 33 జిల్లాలో అంబులెన్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రజలను భయబ్రాంతులకు గురి చేయవద్దని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News