Sunday, December 22, 2024

మళ్లీ డెంగ్యూ స్వైర విహారం.. ఏటా 40 వేల మంది బలి

- Advertisement -
- Advertisement -

Dengue cases on the rise in Karnataka

కర్ణాటకలో పెరుగుతున్న కేసులు

న్యూఢిల్లీ : ఏటా మే 16 జాతీయ డెంగ్యూ దినంగా దేశంలో గుర్తిస్తున్నారు. దేశంలో ప్రధానమైన ఆరోగ్య సమస్యల్లో డెంగ్యూ జ్వరం ఒకటి. పరాన్నజీవుల వల్ల సంక్రమించే అంటువ్యాధుల్లో డెంగ్యూ ఏడెస్ దోమల వల్ల వ్యాపిస్తుంది. 129 దేశాల్లో 3.9 బిలియన్ మంది డెంగ్యూ బాధితులున్నారు. ఏటా 96 మిలియన్ డెంగ్యూ కేసులు నమోదవుతుండగా, 40,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. డెంగ్యూతోపాటు దోమల వల్ల వ్యాపించే మలేరియా, చికున్‌గున్యా, ఫైలేరియా, యెల్లో ఫీవర్, జికా వైరస్ , జపనీస్ ఎన్‌సిఫలిటీస్ (మెదడు వాపు) తదితర వ్యాధుల కారణంగా ఏటా ఏడు లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. డెంగ్యూ ఎక్కువగా పిల్లలకు వ్యాపిస్తుంది. తీవ్రమైన తలనొప్పి, కండరాలు, కీళ్ల దగ్గర నొప్పులు, తీవ్ర జ్వరం, ఆందోళన, నోటికి రుచి లేకపోవడం, ఆకలి లేకుండటం, వాంతులు తదితర లక్షణాలు కనిపిస్తాయి. మేనెలాఖరవుతుండగా, జూన్ వచ్చేసరికి వర్షాకాలంలో డెంగ్యూ చాలా వేగంగా వ్యాపిస్తుంది. దక్షిణ కర్ణాటక, ఉడిపి జిల్లాల్లో డెంగ్యూ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

కర్ణాటకలో గత ఏడాది జనవరి మే మధ్యకాలంలో 850 డెంగ్యూ కేసులు నమోదు కాగా, ఈ ఏడాది ఇదే కాలంలో 1335 కేసులు నమోదు కావడం గమనార్హం. వర్షాలు కురుస్తుండటం, ఇళ్లల్లోను, రోడ్లపైన నీరు నిల్వ ఉండటం వల్ల డెంగ్యూ దోమల ఉత్పత్తి స్థావరాలుగా నీటి నిల్వలు మారుతుండడంతో డెంగ్యూ కేసులు పెరిగిపోతున్నాయని జాతీయ అంటువ్యాధుల నియంత్రణ కార్యక్రమం జాయింట్ డైరెక్టర్ కె . కౌల్‌గడ్ పేర్కొన్నారు. గతవారం రోజులుగా బెంగళూరు ఆస్పత్రులు ఆకస్మాత్తుగా డెంగ్యూ కేసులతో నిండిపోతున్నాయని ఏస్టర్ ఆర్‌వి ఆస్పత్రి ఇంటర్నల్ మెడిసిన్ కన్సల్టెంట్ డాక్టర్ ఎస్ ఎన్ అరవింద్ తెలిపారు. రోగులు 25 నుంచి 40 ఏళ్ల లోపు వారేనని చెప్పారు. ఇళ్లల్లో కానీ బయట కానీ నీరు ఎక్కడా నిలిచిపోకుండా చూసుకోవాలని నిద్రపోయేటప్పుడు దోమ తెరలు ఉపయోగించాలని, బయట నీరు, ఆహారం తీసుకున్నప్పుడు ఆరోగ్య, పరిశుభ్రత నియమాలు పాటించాలని డాక్టర్ బృందా సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News